Share News

అర్నబ్ తుఫాన్‌ ఎఫెక్ట్‌.. సమస్యల పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం వాట్సాప్ సేవలు

ABN , Publish Date - Oct 26 , 2026 | 08:48 PM

అర్నబ్ తుఫాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లోని ప్ర‌జ‌లకు ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌లను మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా తెలిపే అవ‌కాశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కల్పిచింది.

 అర్నబ్ తుఫాన్‌ ఎఫెక్ట్‌.. సమస్యల పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం వాట్సాప్ సేవలు
AP Mana Mitra WhatsApp Governance

అమరావతి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): అర్నబ్ తుఫాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లోని ప్ర‌జ‌లకు ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌లను మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా తెలిపే అవ‌కాశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కల్పిచింది. ఈ మేరకు ఆర్టీజీఎస్ అధికారులు ఈరోజు (సోమవారం) ఓ ప్రకటన విడుదల చేశారు. తుఫాన్ స‌మ‌యంలో క‌రెంటు స‌మ‌స్య‌లు, చెట్లు కూలినా, గోడ‌లు కూలినా, నీళ్లు వ‌చ్చినా తదితర స‌మ‌స్యలు ఎదురైనా మ‌న‌మిత్ర ద్వారా వెంటనే అధికారుల‌కు తెలియజేయవచ్చని సూచించారు.


ఈ సేవల కోసం 9552300009 నంబ‌రుకు హాయ్ అని మెసేజ్ చేయాలని ఆర్టీజీఎస్ అధికారులు తెలిపారు. అక్క‌డున్న సేవ‌ల ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలని సూచించారు. అర్న‌బ్ తుఫాన్ సమస్య అనే ఆప్ష‌న్‌ను ఎంపిక చేసుకోవాలని పేర్కొన్నారు. రిపోర్ట్ ఇష్యూ‌ను ఎంపిక చేసుకుని క‌న్ఫ‌ర్మ్ ఆప్ష‌న్‌ను ఎంపిక చేసుకోవాలని వెల్లడించారు. ఆ తర్వాత రిజిస్ట్రేష‌న్ ఆప్ష‌న్ ఎంపిక చేసుకోవాలని తెలిపారు.


త‌ర్వాత మీ పేరు, జిల్లా, మండ‌లం న‌మోదు చేసి, మీ ప్రాంతంలో తుఫాన్ కార‌ణంగా ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌ను అందులో న‌మోదు చేయాలని అధికారులు పేర్కొన్నారు. వర్షానికి సంబంధించిన ఫొటోలు కూడా అప్‌లోడ్ చేయొచ్చని చెప్పారు. వెంటనే ఆ స‌మ‌స్య‌ను ఆ ప్రాంతంలో సంబంధిత అధికారికి పంపి వెంట‌నే స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌య్యేలా చూస్తారని తెలిపారు. ప్ర‌జ‌లంద‌రూ ఈ స‌దుపాయాన్ని ఉప‌యోగించుకోవాల‌ని ఆర్టీజీఎస్ అధికారులు కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అర్నాబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు హై అలర్ట్.. ముందస్తు చర్యలకు ఆదేశం

జడ్పీ పీఠాలపై కూటమి కసరత్తు.. చంద్రబాబుతో భేటీ తర్వాతే క్లారిటీ!

రక్షణ రంగంలో ఏపీకి బిగ్ బూస్ట్.. రూ. 2, 500 కోట్లతో BEL ప్రాజెక్టు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 26 , 2026 | 10:01 PM