Share News

కాంట్రాక్టర్లకు ఊరట.. రూ.2 వేల కోట్ల బిల్లుల చెల్లింపులు

ABN , Publish Date - Mar 18 , 2026 | 09:47 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ అభివృద్ధి పనులు చేపట్టిన సుమారు 50,000 మంది చిన్న కాంట్రాక్టర్లకు ఊరటనిస్తూ దాదాపు రూ. 2 వేల కోట్ల విలువైన బిల్లుల చెల్లింపులకు ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది.

కాంట్రాక్టర్లకు ఊరట.. రూ.2 వేల కోట్ల బిల్లుల చెల్లింపులు
AP Government

అమరావతి, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ అభివృద్ధి పనులు చేపట్టిన సుమారు 50,000 మంది చిన్న కాంట్రాక్టర్లకు ఊరటనిస్తూ దాదాపు రూ. 2 వేల కోట్ల విలువైన బిల్లుల చెల్లింపులకు ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ప్రణాళికాబద్దంగా పెండింగ్ బిల్లుల చెల్లింపులు జరపాలని సీఎం చంద్రబాబు సూచించారు. బిల్లుల చెల్లింపులపై గత రెండు రోజుల నుంచి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కసరత్తు చేస్తున్నారు.


కొన్ని రోజుల క్రితమే అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ఏపీ ప్రభుత్వం మూడో విడత చెల్లింపులు చేసిన విషయం తెలిసిందే. నిధుల లభ్యత తక్కువగా ఉన్నా ఉగాది నాటికి కొన్ని పెండింగ్ బిల్లుల చెల్లింపులు జరిపేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. చిన్న కాంట్రాక్టర్లకు బిగ్ రిలీఫ్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ బిల్లులను ఏపీ సర్కార్ విడుదల చేసింది. డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్, ఎస్డీఆర్ఎఫ్ - ఎస్డీఎంఎఫ్ వంటి హెడ్స్ కింద పనులు చేసిన కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేయనుంది. కోటి రూపాయల్లోపు పనులు చేపట్టిన కాంట్రాక్టర్లే అత్యధికంగా ఉన్నారని ఆర్థిక శాఖ వెల్లడించింది.


ఈ వార్తలు కూడా చదవండి..

సిలిండర్లు బ్లాక్‌మార్కెట్‌కు తరలకుండా చర్యలు: సీఎం చంద్రబాబు

మద్యం స్కాం కేసులో మరో కీలక పరిణామం.. మరో నిందితుడిని విచారిస్తున్న సిట్

గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు: మంత్రి నారాయణ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Mar 18 , 2026 | 09:53 PM