Share News

సిలిండర్లు బ్లాక్‌మార్కెట్‌కు తరలకుండా చర్యలు: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Mar 16 , 2026 | 07:36 PM

ఎల్‌పీజీ నిల్వలు, బుకింగ్‌, సరఫరాపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఈరోజు(సోమవారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ గ్యాస్‌ సరఫరా కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు.

సిలిండర్లు బ్లాక్‌మార్కెట్‌కు తరలకుండా చర్యలు: సీఎం చంద్రబాబు
AP CM Chandrababu Naidu

అమరావతి, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): ఎల్‌పీజీ నిల్వలు, బుకింగ్‌, సరఫరాపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) సచివాలయంలో ఈరోజు(సోమవారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ గ్యాస్‌ సరఫరా కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం 17,209 టన్నుల ఎల్‌పీజీ స్టాక్‌ అందుబాటులో ఉందని అధికారులు తెలిపారు. 1,154 ఏజెన్సీల నుంచి గ్యాస్‌ సరఫరా అవుతోందని అధికారులు వెల్లడించారు. సిలిండర్లు బ్లాక్‌మార్కెట్‌కు తరలకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.


సిలిండర్లు దుర్వినియోగం కాకుండా చూడాలి..

డెలివరీ సమయంలో సిలిండర్లు దుర్వినియోగం కాకుండా చూడాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అన్న క్యాంటీన్ల కిచెన్లకు గ్యాస్‌ సరఫరాపై సీఎం ఆరా తీశారు. గ్యాస్‌ సిలిండర్లపై ప్రజల్లో గందరగోళం తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మార్గనిర్దేశం చేశారు. సిలిండర్‌ సరఫరా సమయాన్ని సాధారణ పరిస్థితికి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఎల్‌పీజీ సరఫరా, నిల్వలు, బుకింగ్‌ను నిత్యం పర్యవేక్షించాలని నిర్దేశించారు. ఆస్పత్రులు, బడులు, ఆలయాలకు ఇబ్బంది రాకుండా చూడాలని పేర్కొన్నారు. ఎల్‌పీజీ వినియోగం తగ్గించుకునేలా హోటల్‌ సంఘాలతో మాట్లాడాలని తెలిపారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటకకు మరిన్ని కేటాయింపులు జరపనున్నట్లు వెల్లడించారు. పైప్‌లైన్‌, ఇండక్షన్‌ స్టవ్స్‌ అందుబాటులోకి తీసుకువచ్చే అంశాన్ని పరిశీలించాలని సీఎం చంద్రబాబు సూచనలు చేశారు.


ఈస్ట్-వెస్ట్ కార్గో కారిడార్‌గా ఏపీ: సీఎం చంద్రబాబు

ఈస్ట్-వెస్ట్ కార్గో కారిడార్‌గా ఏపీ ఉండనుందని సీఎం చంద్రబాబు తెలిపారు. పోర్టులు, ఫిషింగ్ హార్బర్లపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. నూతన పోర్టుల్లో త్వరితగతిన ఆపరేషన్లు జరుగుతున్నాయని తెలిపారు. రెండోదశ ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం వేగవంతం జరుగుతోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


నేనెప్పుడూ మైనార్టీల పక్షాన ఉంటా: సీఎం చంద్రబాబు

విజయవాడలో ఏపీ ప్రభుత్వం ఇఫ్తార్ విందు ఇచ్చింది. ముస్లింలతో కలిసి ఇఫ్తార్‌ విందులో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. తానెప్పుడూ మైనార్టీల పక్షాన ఉంటానని భరోసా కల్పించారు. మైనార్టీల మనోభావాలను తమ ప్రభుత్వం గౌరవిస్తోందని చెప్పుకొచ్చారు. ఇమామ్‌, మౌజమ్‌ల బకాయిలను విడుదల చేస్తామని ప్రకటించారు. అన్ని నియోజకవర్గాల్లో ఇఫ్తార్‌ విందు కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 21 నెలల్లో మైనార్టీలకు సంక్షేమ కార్యక్రమాలను అందించామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బాబోయ్ పెద్దపులి… 16 రోజులుగా గ్రామాల్లో సంచారం

జనసేన బలోపేతానికి కృషి : నాగబాబు

ఫామ్ హౌస్‌లో డ్రగ్స్ పార్టీ గుట్టురట్టు.. 11 మంది అరెస్ట్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Mar 16 , 2026 | 08:23 PM