ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కాంట్రాక్ట్ టీచర్లకు ఊరట
ABN , Publish Date - May 19 , 2026 | 05:59 PM
ఏపీ మోడల్ స్కూల్స్‌లో కాంట్రాక్ట్ సిబ్బంది సేవలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పొడిగించింది. 123 మంది ఫిజికల్ డైరెక్టర్లు, 120 మంది కంప్యూటర్ టీచర్ల సేవలను పునరుద్ధరించింది.
అమరావతి, మే 19 (ఆంధ్రజ్యోతి): ఏపీ మోడల్ స్కూల్స్‌లో కాంట్రాక్ట్ సిబ్బంది సేవలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) పొడిగించింది. 123 మంది ఫిజికల్ డైరెక్టర్లు, 120 మంది కంప్యూటర్ టీచర్ల సేవలను పునరుద్ధరించింది. 2026 జూన్ 1వ తేదీ నుంచి 2027 ఏప్రిల్ 30వ తేదీ వరకు 11 నెలల పాటు సేవలకు అనుమతి ఇచ్చింది. అకడమిక్ ఇయర్ 2026-27 కోసం కాంట్రాక్ట్ సిబ్బందికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఒక నెల విరామంతో సేవల కొనసాగింపునకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జీఓ ఆర్టీ నంబర్-51ను స్కూల్ ఎడ్యుకేషన్ శాఖ విడుదల చేసింది. ఈ మేరకు ఫైనాన్స్ శాఖ అనుమతితో ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి...
బుల్లెట్ వేగంతో రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్లాంట్.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
భవిష్యత్తు న్యూక్లియర్ రంగంలో ఏపీ కీలక పాత్ర పోషిస్తుంది: నారా లోకేశ్
భార్యను అడ్డుపెట్టుకొని పేర్ని నాని బతికిపోయారు.. మంత్రి పార్థసారథి షాకింగ్ కామెంట్స్
Read Latest AP News And Telangana News And International News And Telugu News