ఏపీ స్థానిక ఎన్నికలు.. బీసీ కోటా కొత్త లెక్కలివే..!
ABN , Publish Date - Oct 10 , 2026 | 05:50 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో డెడికేటెడ్ బీసీ కమిషన్ సిఫార్సులతో బీసీ రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం రక్షణ కల్పించింది.
అమరావతి, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో (AP Local Body Elections) డెడికేటెడ్ బీసీ కమిషన్ సిఫార్సులతో బీసీ రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం రక్షణ కల్పించింది. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ సిఫార్సులకు ఏపీ మంత్రి మండలి ఆమోదంతో ఈ ఎన్నికల్లో బీసీలకు సుమారుగా 4 వేలకు పైగా స్థానాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీలు మినహా వివిధ కేటగిరిలకు చెందిన దాదాపు 1.40 లక్షలకు పైగా స్థానాల్లో బీసీ రిజర్వేషన్లు వర్తింపచేసే ఛాన్స్ ఉంది.
అదనంగా పదవులు..
పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు వర్తింప చేయనుండటంతో 38 వేల మందికి పైగా బీసీలకు పదవులు దక్కనున్నాయి. వైసీపీ హయాంలో చేపట్టిన స్థానిక ఎన్నికల్లోనూ సుమారు 33 వేల మంది బీసీలకే అవకాశాలు దక్కాయి. ఆయా జిల్లాలు, వార్డులు, డివిజన్ల పెంపుతో మరింత మంది బీసీలకు స్థానిక ఎన్నికల్లో అదనంగా పదవులు దక్కే అవకాశాలు ఉన్నాయి. 34 శాతానికంటే తక్కువ రిజర్వేషన్లు ఉండే కేటగిరిలకు కూటమి పార్టీల పరంగా పదవుల కేటాయిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భరోసా ఇచ్చారు.
సుప్రీంకోర్టు గైడ్ లైన్స్‌ను పాటించిన కూటమి సర్కార్..
సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగానే బీసీ రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులు చేసింది. 50 శాతం రిజర్వేషన్లు మించకుండా చేసిన సిఫార్సులను ఆమోదించడం ద్వారా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్‌ను కూటమి ప్రభుత్వం పాటించింది. రాజ్యాంగ ప్రకారం నిబంధనలకు లోబడే ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను అమలు చేస్తూనే.. బీసీలకు మరిన్ని స్థానాల్లో పోటీ అవకాశం కల్పించేలా ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ భూములపై చంద్రబాబు కీలక నిర్ణయం.. రైతులకు భారీ ఊరట
స్థానిక ఎన్నికలపై జగన్‌ది రెండు నాలుకల ధోరణి.. సీఎం ధ్వజం
ఎన్నికల్లో అక్రమాలు జరిగాయి.. రాష్ట్రపతికి ఇండియా కూటమి ఫిర్యాదు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News