డీఎస్పీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. 2,721 పోస్టులతో నోటిఫికేషన్ జారీకి ఛాన్స్
ABN , Publish Date - Nov 04 , 2026 | 04:41 PM
డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఈ రోజు (బుధవారం) రాత్రికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసే ఛాన్స్ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2 వేల 721 పోస్టులతో రెండో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు సమాచారం.
అమరావతి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఈ రోజు (బుధవారం) రాత్రికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసే ఛాన్స్ ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2 వేల 721 పోస్టులతో రెండో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు సమాచారం. గత నెల 13వ తేదీన సార్ట్ నోటిఫికేషన్‌ను సీఎం చంద్రబాబు సర్కార్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ రోజు రాత్రికి పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఇచ్చేందుకు విద్యాశాఖ సిద్దం అవుతోంది.
ఇవాళ నోటిఫికేషన్‌లో దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల తేదీలు, సిలబస్ గురించి అధికారులు వివరణ ఇవ్వనున్నారు. ఈ పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్లు 931, స్కూల్ అసిస్టెంట్లు (స్పెషల్ ఎడ్యూకేషన్) 255, సెకండరీ గ్రేడ్ టీచర్స్ 1231, ఎస్‌జీటీ (స్పెషల్ ఎడ్యూకేషన్) 304 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ఏడాది మెగా డీఎస్సీ ద్వారా 16 వేల 342 పోస్టులను ఏపీ విద్యాశాఖ భర్తీ చేసిన విషయం తెలిసిందే.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా కూటమిదే విజయం: పవన్ కల్యాణ్
మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ఘన విజయం.. మంత్రి లోకేశ్ ఆసక్తికర పోస్టు
స్థానిక ఎన్నికలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: డీజీపీ
Read Latest AP News And Telangana News And National News
And Telugu News