ఏపీ స్థానిక ఎన్నికలు.. 4,372 ప్రాంతాల్లో పటిష్ఠ భద్రతా: డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా
ABN , Publish Date - Oct 30 , 2026 | 06:21 PM
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రశాంతమైన, స్వేచ్ఛాయుతంగా ఎన్నికల నిర్వహణకు 36,351 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 4,372 ప్రాంతాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.
అమరావతి, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రశాంతమైన, స్వేచ్ఛాయుతంగా ఎన్నికల నిర్వహణకు 36,351 మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా (AP DGP Harish Kumar Gupta) స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 4,372 ప్రాంతాల్లో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు. ఈరోజు (శుక్రవారం) అమరావతి వేదికగా మీడియాతో డీజీపీ మాట్లాడారు. 2026 అక్టోబర్ 15వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఏపీవ్యాప్తంగా ఈ ఎన్నికలకు సంబంధించి మొత్తం 261 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు.
తిరుపతి జిల్లాలో అత్యధికంగా 61 కేసులు, వైఎస్సార్ కడప జిల్లాలో 36, అన్నమయ్య జిల్లాలో 31, అనంతపురం జిల్లాలో 26, మార్కాపురం జిల్లాలో 22 కేసులు నమోదైనట్లు డీజీపీ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 107 మందిని అరెస్ట్ చేయగా, 733 మందికి 35(3) BNSS కింద నోటీసులు జారీ చేశామని అన్నారు. అన్నమయ్య జిల్లాలో అత్యధికంగా 51 మంది, తిరుపతి జిల్లాలో 27 మంది, వైఎస్సార్ కడప జిల్లాలో 16 మంది, ప్రకాశం జిల్లాలో 8 మంది, కర్నూలు జిల్లాలో 5 మందిని అరెస్ట్ చేశామని తెలిపారు.
స్థానిక ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే అవకాశమున్న వ్యక్తులపై ముందస్తు నివారణ చర్యలు చేపడుతున్నట్లు డీజీపీ స్పష్టం చేశారు. 1,05,767 మంది మీద ఓటింగ్ ప్రక్రియలో ఎలాంటి నేరాలకు పాల్పడకుండా.. చట్టానికి కట్టుబడి ఉండేలా బైండోవర్‌లోకి తీసుకున్నామని చెప్పారు. పెండింగ్‌లో ఉన్న 2,726 నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేశామని తెలిపారు. ఏపీ వ్యాప్తంగా జరిగిన తనిఖీల్లో నగదు, మద్యం, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నామని డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తుఫాన్ సహాయక పర్యవేక్షణకు త్వరలో ఎస్ఓపీ విధానం తెస్తాం: సీఎం చంద్రబాబు
స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించండి: హోం మంత్రి అనిత
ఆర్నబ్ తుఫాన్ వేళ.. ఏపీకి తెలంగాణ అండ.. విద్యుత్ పునరుద్ధరణకు ప్రత్యేక బృందాలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News