టాప్ ర్యాంకులతో ప్రతిభ చూపిన ఎన్టీఆర్ కాలేజ్ విద్యార్థులు.. సీఎం అభినందనలు
ABN , Publish Date - Apr 15 , 2026 | 10:05 AM
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు నిర్వహించిన పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన ఎన్టీఆర్ మహిళా జూనియర్, డిగ్రీ కాలేజ్ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. అన్ని విభాగాల నుంచి పదుల సంఖ్యలో విద్యార్థులు అత్యధిక మార్కులు, టాప్ ర్యాంకులతో ప్రతిభ కనబరచడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని వ్యాఖ్యానించారు.
అమరావతి, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు నిర్వహించిన పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన ఎన్టీఆర్ మహిళా జూనియర్, డిగ్రీ కాలేజ్ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu) అభినందనలు తెలిపారు. అన్ని విభాగాల నుంచి పదుల సంఖ్యలో విద్యార్థులు అత్యధిక మార్కులు, టాప్ ర్యాంకులతో ప్రతిభ కనబరచడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం ట్వీట్ పెట్టారు.
సీనియర్ ఎంపీసీ నుంచి 2, 3 రాష్ట్ర ర్యాంకులతో పాటు జూనియర్ ఎంపీసీలో 10 మంది విద్యార్థులు, జూనియర్ బైపీసీలో 11 మంది విద్యార్థులకు ఉత్తమ ర్యాంకులు వచ్చాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే జూనియర్ ఎంఈసీలో 3, 4 ర్యాంకులు, జూనియర్ సీఈసీలో 5వ ర్యాంకు ఎన్టీఆర్ మహిళా జూనియర్, డిగ్రీ కాలేజ్ విద్యార్థులకు రావడం గర్వకారణమని తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ అందిస్తున్న అత్యున్నత సేవలకు దక్కిన ఫలితం ఇదని ఉద్ఘాటించారు. దీనికి కారణమైన ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వాహకులకు, కళాశాల బోధనా సిబ్బందికి, ఉద్యోగులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. ఇదే ఉత్సాహం, ఇదే సేవా స్ఫూర్తిని ఇలాగే కొనసాగించాలని కోరుకుంటున్నానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మహానాడు నిర్వహణపై లోకేశ్ కీలక చర్చలు.. స్థలాల పరిశీలనకు ఆదేశాలు
మావిగన్ పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.. జగన్ అండ్ కోపై ఆనం ధ్వజం
కీలక భేటీకి ఎన్డీఏ సిద్ధం.. మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రధాన చర్చ
Read Latest AP News And Telangana News And International News And Telugu News