Share News

స్విట్జర్లాండ్‌లో అన్నమయ్య కీర్తనను ఆలపించిన చాంటిక్లియర్ బృందం.. సీఎం చంద్రబాబు ప్రశంసలు

ABN , Publish Date - Nov 28 , 2026 | 08:02 PM

సోల్స్‌బర్గ్ ఫెస్టివల్ - 2026 వేదికగా చాంటిక్లియర్ బృందం అన్నమయ్య కీర్తనను ఆలపించిన విషయం తెలిసిందే. ఈ బృందం ఆలపించిన అన్నమయ్య కీర్తన వీడియోపై సీఎం చంద్రబాబు స్పందించారు.

స్విట్జర్లాండ్‌లో అన్నమయ్య కీర్తనను ఆలపించిన చాంటిక్లియర్ బృందం.. సీఎం చంద్రబాబు ప్రశంసలు
AP CM Chandrababu Naidu

అమరావతి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): సోల్స్‌బర్గ్ ఫెస్టివల్ - 2026 వేదికగా చాంటిక్లియర్ బృందం అన్నమయ్య కీర్తనను ఆలపించిన విషయం తెలిసిందే. ఈ బృందం ఆలపించిన అన్నమయ్య కీర్తన వీడియోపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) స్పందించారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన పోస్టు పెట్టారు. అద్భుతమైన ప్రదర్శన అంటూ గ్రామీ అవార్డు విజేత చాంటిక్లియర్‌కు చెందిన A cappella బృందాన్ని సీఎం చంద్రబాబు ప్రశంసించారు.


15వ శతాబ్దపు వాగ్గేయకారుడు అన్నమయ్య రచించిన బ్రహ్మమొక్కటే కీర్తనను స్విట్జర్లాండ్‌లోని సోల్స్ బర్గ్ ఫెస్టివల్-2026 వేదికపై ఆలపించడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. సకల జీవులంతా ఒక్కటేననే అన్నమాచర్య కీర్తనలోని సందేశం ప్రపంచవ్యాప్తంగా అందర్నీ ఆకర్షించిందని తెలిపారు. సరిహద్దులు, భాషలు, తరాలకు అతీతంగా నిలిచే మన తెలుగు సంస్కృతి, వారసత్వపు గొప్పతనాన్ని ఈ అజరామరమైన కీర్తన గుర్తుచేస్తోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మహిళా రిజర్వేషన్ల అమలుకు మోదీ సర్కార్ నయా ప్లాన్.. డీలిమిటేషన్ బిల్లులో కీలక మార్పులు

అమరావతి రైతులు చేసిన త్యాగాన్ని జగన్ అండ్ కో ఎగతాళి చేస్తున్నారు.. సీఎం చంద్రబాబు ధ్వజం

రాజకీయ విభేదాలకు అతీతంగా డీలిమిటేషన్ బిల్లుకు మద్దతివ్వాలి: పవన్ కల్యాణ్

Read Latest AP News And Telangana NewsAnd National News

And Telugu News

Updated Date - Nov 28 , 2026 | 10:04 PM