అమరావతిలో క్వాంటమ్ టెక్నాలజీకి మరో అడుగు.. క్యూ-శివ కంప్యూటర్ల ఆవిష్కరణ
ABN , Publish Date - Oct 03 , 2026 | 06:39 PM
విజయవాడలో నిర్వహించిన పాన్ ఐఐటీ అమరావతి సమ్మిట్‌లో కీలక ఘట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఆవిష్కరించారు. క్యూబిట్ ఫోర్స్ సంస్థ క్యూ-శివ పేరుతో రూపొందించిన ఐదు క్వాంటమ్ కంప్యూటర్లను ఆవిష్కరించారు.
విజయవాడ, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): విజయవాడలో నిర్వహించిన పాన్ ఐఐటీ అమరావతి సమ్మిట్‌లో కీలక ఘట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ఈరోజు (శనివారం) ఆవిష్కరించారు. క్యూబిట్ ఫోర్స్ సంస్థ క్యూ-శివ పేరుతో రూపొందించిన ఐదు క్వాంటమ్ కంప్యూటర్లను ఆవిష్కరించారు. మినీ టెస్టింగ్ క్యాంటమ్ కంప్యూటర్ ల్యాబ్‌లుగా క్యూ- క్వాంటమ్ కంప్యూటర్లు ఉపయోగపడనున్నాయి. 4 కెల్విన్ ప్రాసెసర్ - సృష్టిని కూడా సీఎం ఆవిష్కరించారు.
మేకిన్ అమరావతి కాన్సెప్టుతో క్యూ శివ కంప్యూటర్లు..
క్యాంటమ్ శివ కంప్యూటర్ల తయారీలో కీలకంగా వ్యవహరించిన చండీగఢ్ యూనివర్సిటీ, క్యూబిట్ ఫోర్స్ ప్రతినిధులను సీఎం చంద్రబాబు అభినందించారు. మేకిన్ అమరావతి కాన్సెప్టుతో క్యూ శివ కంప్యూటర్లను రూపొందించారు. క్యాంటమ్ శివ కంప్యూటర్ల తయారీకి అవసరమైన కాంపొనెంట్లల్లో కొన్ని మచిలీపట్నంలో లభిస్తాయని క్యూబిట్ సంస్థ సీఈఓ వెంకటసుబ్రమణ్యం తెలిపారు. ప్రపంచంలో కేవలం రెండు, మూడు చోట్ల మాత్రమే లభించే కాంపోనెంట్లు మచిలీపట్నంలో దొరుకుతాయని క్యూబిట్ సీఈఓ వివరించారు. తమకు సీఎం చంద్రబాబు ఇచ్చిన సహాకారాన్ని మరిచిపోలేమని క్యూబిట్ సీఈఓ చెప్పుకొచ్చారు. అనంతరం క్యూబిట్ సంస్థ ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు సెల్ఫీ దిగారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తయారు చేస్తాం: సీఎం చంద్రబాబు
నన్ను ఆంధ్ర బిడ్డగా భావించండి: అనంత్ అంబానీ
ప్రభుత్వ విద్యాసంస్థలపై నమ్మకాన్ని పెంచుతున్నాం: ఎంపీ శ్రీభరత్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News