Share News

పోలవరం పనులు వేగవంతం చేయాలి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు

ABN , Publish Date - Jul 13 , 2026 | 05:28 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ప్రాజెక్టు పనులపై దృష్టి సారించారు.

పోలవరం పనులు వేగవంతం చేయాలి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
AP CM Chandrababu Naidu

ఏలూరు జిల్లా, జులై 13 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) పోలవరం ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తి చేయడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ప్రాజెక్టు పనులపై దృష్టి సారించారు. పోలవరం ప్రాజెక్టు వద్ద అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులతో సీఎం ఈరోజు (సోమవారం) సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకూ 89 శాతం మేర సివిల్ పనుల్లో పురోగతి ఉందని అధికారులు తెలిపారు. ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్ గ్యాప్2, గ్యాప్1 పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.


కుడి, ఎడమ కాలువల కనెక్టివిటీ టన్నెల్ పనులు ఈ నెలాఖరుకు పూర్తి అవుతాయని అధికారులు వెల్లడించారు. ఈ ప్రాజెక్టు డ్యామ్‌కు చేరుకునే వివిధ రోడ్లు, కుడి, ఎడమ గట్లకు సంబధించిన పనులు, గండి పోచమ్మ ఆలయం అభివృద్ధి పనులు శరవేగంగా చేపట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారు. పునరావాసం, పరిహారం అందించే విషయంలో నిర్వాసితులకు ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం మార్గనిర్దేశం చేశారు.


భూ సేకరణ, ఆర్ అండ్ ఆర్, పునరావాసం త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు వద్ద ఐకానిక్ బ్రిడ్జిని నిర్మించాలని సూచించారు. వివిధ మౌలిక సదుపాయాలను కూడా కల్పించాలని స్పష్టం చేశారు. 2014 నుంచి ఇప్పటి వరకూ పోలవరం ప్రాజెక్టును 37 సార్లు సందర్శించినట్లు తెలిపారు. 136 సార్లు ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్షలు నిర్వహించినట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ప్రధాని మోదీ నేతృత్వంలో భారత్ తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది: సీఎం చంద్రబాబు

సీఆర్డీఏ ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఊరట

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 13 , 2026 | 05:40 PM