నిత్యావసరాలు బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Nov 25 , 2026 | 08:24 PM
నిత్యావసరాల ధరల భారం ప్రజలపై పడకూడదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. 500 కేంద్రాలకు ధరణి బియ్యం విక్రయాలను విస్తరించాలని ఆజ్ఞాపించారు.
అమరావతి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): నిత్యావసరాల ధరల భారం ప్రజలపై పడకూడదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP Chandrababu Naidu) అధికారులను ఆదేశించారు. 500 కేంద్రాలకు ధరణి బియ్యం విక్రయాలను విస్తరించాలని ఆజ్ఞాపించారు. ఈరోజు (బుధవారం) రాష్ట్ర సచివాలయంలో ధరల నియంత్రణపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.
డిసెంబరు మొదటి వారం నుంచి రేషన్ దుకాణాల ద్వారా కందిపప్పు, పామాయిల్ సరఫరా చేయాలని ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు. డిమాండ్ ఉన్న పంటల సాగుకు ప్రోత్సాహం కల్పించాలని నిర్దేశించారు. నిత్యావసరాలు బ్లాక్ మార్కెట్‌కు తరలకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రభుత్వ చర్యలతో బియ్యం, ఉల్లి, పామాయిల్ ధరలు తగ్గాయని అధికారులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మత్స్యకారుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలించాలి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి
అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై కీలక ముందడుగు.. పోర్టులు, లాజిస్టిక్స్‌పై ప్రత్యేక దృష్టి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News