రైతులకు త్వరగా ఇన్‌పుట్ సబ్సిడీ అందించాలి: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Nov 28 , 2026 | 07:42 PM
రైతులకు త్వరగా ఇన్‌పుట్ సబ్సిడీ అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కరువు, తుపానుల బాధిత రైతులకు ఆర్థిక భరోసా కల్పించాలని తెలిపారు.
అమరావతి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): రైతులకు త్వరగా ఇన్‌పుట్ సబ్సిడీ అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) పేర్కొన్నారు. కరువు, తుపానుల బాధిత రైతులకు ఆర్థిక భరోసా కల్పించాలని తెలిపారు. ఈరోజు (శనివారం) రాష్ట్ర సచివాలయంలో కరువు, తుపానుల నష్టంపై సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఇన్‌పుట్ సబ్సిడీతో పాటు బీమా పరిహారం చెల్లించాలని సూచించారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నిధులను పూర్తిగా వినియోగించాలని నిర్దేశించారు. రైతుల ఖాతాల్లో నేరుగా పరిహారం జమ చేయాలని ఆదేశించారు. రైతులకు పరిహారంలో జాప్యం చేయొద్దని ఆదేశించారు. కరువు, తుపానుల నష్టానికి రూ.2,459 కోట్ల పరిహారం ప్రతిపాదనలు చేశామని తెలిపారు.
రైతులకు అండగా నిలవాలి..
ఎల్‌నినో కరువు నష్టానికి రూ.1,721 కోట్ల ప్రతిపాదన చేశామని ముఖ్యమంత్రి వెల్లడించారు. అర్నబ్ తుపాను నష్టానికి రూ.602 కోట్ల ప్రతిపాదన చేశామని చెప్పుకొచ్చారు. మురసు తుపాను నష్టానికి రూ.97 కోట్ల ప్రతిపాదన చేశామని అన్నారు. వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక రంగాలకు పరిహారం ఇస్తామని స్పష్టం చేశారు. ఎస్డీఆర్ఎఫ్ నిధులతో రైతులకు అండగా నిలవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అదనపు విపత్తు నిధులు సాధించాలని అన్నారు. ఉద్యాన పంటలతో పాటు ప్రకృతి సేదానికీ జీ రామ్ జీ నిధులు విడుదల చేస్తామని తెలిపారు. ప్రకృతి వ్యవసాయానికి నిధుల వినియోగంపై అనుమతులు పొందాలని అన్నారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, బీమా రెండూ అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మహిళా రిజర్వేషన్ల అమలుకు మోదీ సర్కార్ నయా ప్లాన్.. డీలిమిటేషన్ బిల్లులో కీలక మార్పులు
అమరావతి రైతులు చేసిన త్యాగాన్ని జగన్ అండ్ కో ఎగతాళి చేస్తున్నారు.. సీఎం చంద్రబాబు ధ్వజం
రాజకీయ విభేదాలకు అతీతంగా డీలిమిటేషన్ బిల్లుకు మద్దతివ్వాలి: పవన్ కల్యాణ్
Read Latest AP News And Telangana NewsAnd National News
And Telugu News