పొదుపు చర్యలపై ప్రజలకు అవగాహన కల్పిద్దాం: సీఎం
ABN , Publish Date - May 14 , 2026 | 03:09 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు.
అమరావతి, మే 14 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) అధ్యక్షతన ఈరోజు (గురువారం) సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సూచించిన పొదుపు చర్యలపై ప్రత్యేకంగా కేబినెట్‌లో చర్చించారు. ఏపీలో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోంపై చర్చించినట్లు సమాచారం. సూర్యఘర్, పీఎం కుసుంను సీరియస్‌గా తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
దేశాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత..
దేశాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. కాన్వాయ్‌ల తగ్గింపుతో సరిపోదని.. మరిన్ని పొదుపు చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రజలకు ముందుగా అవగాహన కల్పిద్దామని తెలిపారు. వారానికి ఒక రోజు నో వెహికల్ డే పాటిద్దామని పిలుపునిచ్చారు. కొన్ని రోజులు మంత్రుల విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాడాలని సూచించారు. అవసరమైతే సెక్రటేరియట్‌కి సైకిల్ మీద రావాలని మార్గనిర్దేశం చేశారు. సంక్షోభ నిర్వహణ అందరికీ రావాలని సూచించారు. సంక్షోభాన్ని మేనేజ్ చేయడం అందరు తెలుసుకోవాలని సూచించారు. ఈ విషయంలో మంత్రులు, అధికారులకు బాధ్యత ఉంటుందని తెలిపారు. దేశాన్ని మనం కాపాడుకోవాలని చెప్పారు. అందరం కాన్వాయ్‌లు తగ్గించుకుంటే సరిపోదని అన్నారు. ఇంకా ఇతర పొదుపు చర్యలు తీసుకోవాలని తెలిపారు. వాడే వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చుకోవాలని మార్గనిర్దేశం చేశారు. మంత్రులు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు లేదా.. ఈవీ, సైకిల్ వినియోగించాలని నిర్ణయించారు. జిల్లాల పర్యటనల్లోనూ కాస్ట్ కటింగ్ పాటించాలని నిర్ణయం తీసుకున్నారు. అధిక సంఖ్యలో సమావేశాలు వర్చువల్‌గా నిర్వహించాలని తెలిపారు. ప్రెజెన్స్ అవసరం లేని ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని నిర్ణయించారు. ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో ఖర్చులు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు.
పొదుపు చర్యలు వివరిద్దాం: సీఎం
పొదుపు చర్యలని మనం ఒకేసారి ప్రజలకు చెబితే ఇబ్బంది పడతారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. నిదానంగా వెళ్దామని పవన్ కల్యాణ్ సూచించారు. రెండు రోజుల పాటు మనం ప్రజలకు అన్ని పొదుపు చర్యలు వివరిద్దామని సీఎం అన్నారు. అలానే చేద్దామని మిగతా మంత్రులు చెప్పారు. వర్క్ ఫ్రం హోం, కార్ పూలింగ్ పాటించాలని సీఎం సూచించారు. ఆయా శాఖల్లో చేపట్టాల్సిన పొదుపు చర్యలపై కార్యదర్శులు నివేదిక ఇవ్వాలని కోరారు. ఒక కేబినెట్ సబ్‌కమిటీని నియమిస్తే బాగుంటుందని వివరించారు. ముందుగా ప్రజలకు అన్ని విషయాలు విడమర్చి చెబుదామని మంత్రులు ప్రస్తావించారు. ప్రజలకు అవగాహన కలిగించిన తర్వాత మనం ఒక నిర్ణయం తీసుకుందామని డిప్యూటీ సీఎం చెప్పారు. అలాగే చేద్దామని ముఖ్యమంత్రి అన్నారు.
కార్యదర్శులపై సీఎం సీరియస్..
కాగా, మంత్రివర్గ సమావేశానికి కార్యదర్శులు సమయానికి రాకపోవడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా సమావేశం ఉందని చెప్పిన రాకపోతే ఎలా అని సీరియస్ అయ్యారు. సీరియస్‌నెస్ లేకపోతే ఎలా అని మందలించారు. ఈ భేటీకి సమయానికి రానివాళ్ల పేర్లు రాసుకుని సీరియస్ యాక్షన్ తీసుకోవాలని ఆదేశించారు.
కీలక ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం..
ఉద్యోగాల కల్పనపై కీలక ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కర్నూలు ఎయిర్‌పోర్ట్ పీపీపీ మోడ్‌లో అభివృద్ధిపై చర్చించారు. వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై నిర్ణయం తీసుకున్నారు. MSMEలకు నిధుల సౌలభ్యానికి ప్రత్యేక టీంను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సాగునీటి కాల్వల విస్తరణ, రోడ్లు, పరిశ్రమలకు మౌలిక సదుపాయాలపై మాట్లాడారు. శుద్ధ ఇంధనం, ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, భారీ సోలార్ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చారు. పంప్డ్ స్టోరేజీ, బయో గ్యాస్ యూనిట్లకు అనుమతి ఇచ్చారు. శుద్ధ ఇంధనం రంగంలో ఏపీని అగ్రస్థానంలో నిలిపేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. విద్యుత్ సంస్థల్లో ఇంజినీరింగ్ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అగ్రిగోల్డ్ కేసులపై ప్రత్యేక బృందాన్ని నియమించాలని మంత్రిమండలి సమావేశంలో నిర్ణయించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
దుబారా ఖర్చులను తగ్గిద్దాం.. సీఎం చంద్రబాబు పిలుపు
ఆంధ్రప్రదేశ్‌లో డిజిటల్ విప్లవానికి శ్రీకారం.. భారత్‌నెట్ అమలుకు చరిత్రాత్మక ఒప్పందం
నా కస్టోడియల్ టార్చర్ కేసును వదిలే ప్రసక్తే లేదు: రఘురామ
Read Latest AP News And Telangana News And International News And Telugu News