Share News

అధికారులు మీ తీరు మార్చుకోవాలి.. సీఎం చంద్రబాబు ఫైర్

ABN , Publish Date - Mar 12 , 2026 | 12:55 PM

కలెక్టర్ల సమావేశంలో ఫారెస్ట్ అధికారులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. అభయారణ్యం పేరుతో అభివృద్ధి పనులు ఆపడం సరైనది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారులు మీ తీరు మార్చుకోవాలి.. సీఎం చంద్రబాబు ఫైర్
AP CM Chandrababu Naidu

అమరావతి, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): కలెక్టర్ల సమావేశంలో ఫారెస్ట్ అధికారులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) సీరియస్ అయ్యారు. అభయారణ్యం పేరుతో అభివృద్ధి పనులు ఆపడం సరైనది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లో ప్రాథమిక సౌకర్యాలకు కూడా అడ్డంకులు సృష్టించడం తగదని పేర్కొన్నారు. పాపికొండల ప్రాంతంలో ఇళ్ల నిర్మాణం, బోర్‌వెల్స్‌కు అనుమతులు ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆమోదించిన ఇళ్లకు కూడా ఫారెస్ట్ క్లియరెన్స్ ఇవ్వకపోవడమేంటని ప్రశ్నించారు. గిరిజనులకు నీరు, రహదారి, విద్యుత్ వంటి కనీస సదుపాయాలు కల్పించాల్సిందేనని స్పష్టం చేశారు.


అటవి అధికారుల తీరు మార్చుకోవాలి..

ఇప్పటికే ఉన్న రహదారిపై గ్రావెల్ లేదా మెటల్ వేయడానికి అభ్యంతరం చెప్పడమేంటనీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. అధికారుల వ్యవహర శైలిపై చాలా ఫిర్యాదులు వస్తున్నాయంటూ హెచ్చరించారు. అధికారులు ఇప్పటికైనా మారాలని అన్నారు. సమస్యలు ఉంటే నేరుగా తనకు లేదా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు తెలియజేయాలని సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఏలూరు కలెక్టర్, డీఎఫ్‌వో కలిసి ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని హుకుం జారీ చేశారు. అభివృద్ధి పనులు ఆగిపోకుండా అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వదేశీ రక్షణ తయారీకి సాగర్ డిఫెన్స్ ప్రాజెక్ట్‌ ఊతం: మంత్రి నారాయణ

మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్.. ప్రజాసమస్యల పరిష్కారం కోసం చర్యలు

జగన్ హయాంలో పెట్టుబడిదారులను వేధించారు.. సీఎం చంద్రబాబు ధ్వజం

Read Latest International News And Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 12 , 2026 | 01:08 PM