పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - May 11 , 2026 | 05:05 PM
పారిశ్రామిక పురోగతిలో సీఐఐది కీలక పాత్ర అని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో దేశం పారిశ్రామికంగా వృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. వినూత్న ఆలోచనలతో లక్ష్యాలు చేరుకోవచ్చని వివరించారు.
ఢిల్లీ, మే 11 (ఆంధ్రజ్యోతి): పారిశ్రామిక పురోగతిలో సీఐఐది కీలక పాత్ర అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలో దేశం పారిశ్రామికంగా వృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. వినూత్న ఆలోచనలతో లక్ష్యాలు చేరుకోవచ్చని వివరించారు. 1990 నాటి ఆర్థిక సంస్కరణల ఫలితాలను ఇప్పుడు చూస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈరోజు (సోమవారం) ఢిల్లీలో జరిగిన సీఐఐ వార్షిక సదస్సులో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ప్రధాని మోదీ సుస్థిరమైన పాలన అందిస్తున్నారని తెలిపారు. ప్రజలు ఖర్చులు తగ్గించుకోవాలని మోదీ సూచించారని అన్నారు.
ప్రపంచంపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం..
సరైన సమయంలో సరైన నాయకుడిగా మోదీ ఉన్నారని సీఎం వ్యాఖ్యానించారు. ప్రపంచంపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం తీవ్రంగా ఉందని వెల్లడించారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం భారత్‌పై పడకుండా కేంద్ర ప్రభుత్వం చూసిందని తెలిపారు. ప్రస్తుతం ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీ కండక్టర్లు.. క్లీన్ ఎనర్జీ యుగం నడుస్తోందని వివరించారు. వికసిత్ భారత్ దిశగా ముందుకెళ్తున్నామని చెప్పుకొచ్చారు. భారత ఆర్థికవృద్ధి వేగంగా కదులుతోందని అన్నారు. పెట్టుబడులకు స్వర్గధామం ఆంధ్రప్రదేశ్ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మా ఇంటికి ప్రధాని రావడం గొప్ప గౌరవం: సీఎం చంద్రబాబు
జగన్ హయాంలో ఆలయాలకు భద్రత కొరవడింది: మంత్రి ఆనం
కైలాసగిరి త్రిశూలం ఆధ్యాత్మిక పునరుజ్జీవనానికి ప్రతీక: మంత్రి నారా లోకేశ్
Read Latest AP News And Telangana News And International News And Telugu News