సాగుకు భద్రత, రైతుకు అధిక ఆదాయమే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Apr 24 , 2026 | 09:50 PM
సాగుకు భద్రత - అధిక ఆదాయం సాధించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఏడాదంతా పొలం పచ్చగా ఉండాలని – రైతన్న పంట పండాలని ఆకాంక్షించారు.
అమరావతి, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): సాగుకు భద్రత - అధిక ఆదాయం సాధించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandra babu Naidu) వ్యాఖ్యానించారు. ఏడాదంతా పొలం పచ్చగా ఉండాలని – రైతన్న పంట పండాలని ఆకాంక్షించారు. ఈరోజు (శుక్రవారం) ఏపీ సచివాలయంలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
ఎల్‌నినో ఎదుర్కొనేలా ముందస్తు చర్యలు తీసుకుంటామని, పీఎండీఎస్ అమలు చేస్తామని సీఎం పేర్కొన్నారు. 50 లక్షల ఎకరాల్లో హార్టికల్చర్ సాగుకు యాక్షన్ ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. హెక్టారుకు సగటు యూరియా వినియోగం తగ్గిందని వెల్లడించారు. ఈ ఏడాది 11 లక్షల హెక్టార్లలో ప్రకృతి సాగయిందని చెప్పుకొచ్చారు. 250 ఎకరాల్లో కోకో సిటీ - ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్.. హనీట్రాప్ ముఠా సంచలనం
శబరిమల కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
బాలికల కాలేజీలో కోఎడ్యుకేషన్ ఏర్పాటుపై హైకోర్టు అసంతృప్తి
Read Latest AP News And Telangana News And International News And Telugu News