ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రస్థానంపై ఏపీ కేబినెట్ అభినందన తీర్మానం
ABN , Publish Date - Oct 07 , 2026 | 02:19 PM
ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఏపీ కేబినెట్ అభినందనలు తెలిపింది. మోదీ పాలన, సంస్కరణలను సీఎం చంద్రబాబు ప్రశంసించగా.. మంత్రి నారా లోకేశ్ రెండు పేజీల తీర్మానాన్ని చదివి వినిపించారు.
అమరావతి, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) అధ్యక్షతన కేబినెట్ సమావేశం ఈరోజు (బుధవారం) సచివాలయంలో జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలను ఆమోదించారు. 12 అజెండా అంశాలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. కేబినెట్ అజెండా పూర్తి అయినా వెంటనే ఇతర అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అభినందనలు తెలుపుతూ ఏపీ మంత్రి మండలి తీర్మానం ప్రవేశపెట్టింది. మోదీ పరిపాలనను ప్రశంసిస్తూ సీఎం, మంత్రులు మాట్లాడారు.
రెండు పేజీల తీర్మానాన్ని చదివి వినిపించిన మంత్రి లోకేశ్..
మోదీ పరిపాలనను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు ప్రశంసించారు. ఆయనను అభినందిస్తూ చేసిన రెండు పేజీల తీర్మానాన్ని చదివి మంత్రి నారా లోకేశ్ వినిపించారు. సీఎంగా, ప్రధానిగా 25 ఏళ్లు పనిచేసి ప్రజలను మెప్పించడం సామాన్యమైన విషయం కాదని సీఎం చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. మనం కూడా 25 ఏళ్లు వరుసగా పాలనలో ఉండలేకపోయామని ప్రస్తావించారు. కొంతమంది సీఎంగా 25 ఏళ్లు పనిచేసిన సంస్కరణలు తీసుకురాలేకపోయారని చెప్పుకొచ్చారు. కానీ జనాన్ని మెప్పించి పరిపాలన చేయడమే గాకుండా సంస్కరణలు కూడా చేసి జనాన్ని మోదీ ఒప్పించారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
ప్రధాని మోదీ పాలనా సంస్కరణలను స్ఫూర్తిగా తీసుకుంటాం: మంత్రి కొలుసు పార్థసారథి
ప్రభుత్వాధిపతిగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రధాని మోదీకి అభినందనలు తెలుపుతూ ఏపీ కేబినెట్ ప్రత్యేక తీర్మానం ఆమోదించిందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ప్రధాని మోదీ పాలనా సంస్కరణలు, కట్టుబాట్లను స్ఫూర్తిగా తీసుకుని ఆయా జిల్లాల అభివృద్ధికి కృషి చేయాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారని అన్నారు.
సీఎం చంద్రబాబుతో మంత్రి నారాయణ భేటీ..
మరోవైపు.. కేబినెట్ భేటీ తర్వాత సీఎం చంద్రబాబుతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. రాజధానిలో కేటగిరి -4, ఎండోమెంట్ భూముల అంశంపై సీఎంతో చర్చించారు. న్యాయపరమైన అంశాలను చర్చించిన తర్వాత మరోసారి తన దృష్టికి తీసుకురావాలని ముఖ్యమంత్రి సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అమరావతి పనుల్లో వేగం పెంచాలి.. ప్రతి నెల రూ. 2వేల కోట్ల పనులు పూర్తి చేయాలి: సీఎం
టీటీడీ భక్తులకు అలర్ట్.. ఆ రోజుల్లో VIP దర్శనాలు రద్దు
‘స్త్రీశక్తి’ 100 కోట్లకు పైగా ప్రయాణాలు పూర్తి చేసుకోవడం గర్వకారణం: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News