విధి నిర్వహణలో బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ మృతి.. హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి
ABN , Publish Date - Nov 27 , 2026 | 02:21 PM
విధి నిర్వహణలో ఏపీకి చెందిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ మృతిచెందారు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అమరావతి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): విధి నిర్వహణలో ఏపీకి చెందిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ మృతిచెందారు. భారత్ - బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఈ విషాద ఘటన జరిగింది. నదిలో మునిగి బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ కడిమి వేణు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు అనిత ఓ ప్రకటన విడుదల చేశారు.
వేణు త్యాగం మరువలేనిది: అనిత
గోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన వేణు మృతిచెందడం బాధకరమని అనిత అన్నారు. 31 ఏళ్ల వయసులోనే ఆయన మృతిచెందడం బాధాకరమని తెలిపారు. వేణు మరణ వార్త తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. దేశసేవలో ప్రాణాలు కోల్పోయిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్‌కు ఘన నివాళి అర్పించారు. వీర జవాన్ కడిమి వేణు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేశ రక్షణ విధుల్లో ప్రాణాలు కోల్పోయిన వేణు త్యాగం మరువలేనిదని హోం మంత్రి అనిత కొనియాడారు.
ఈ వార్తలు కూడా చదవండి...
తిరుమలను దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతాం: సీఎం చంద్రబాబు
డిసెంబర్‌లో నంది అవార్డుల వేడుక.. భారీ ఏర్పాట్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
స్థానిక ఎన్నికల్లో హింసకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు: డీజీపీ
Read Latest AP News And Telangana NewsAnd National News
And Telugu News