తూర్పుగోదావరి జిల్లా పొగాకు బ్యారెన్‌లో భారీ అగ్నిప్రమాదం.. రూ.10 లక్షల నష్టం
ABN , Publish Date - Nov 09 , 2026 | 12:13 PM
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరం గ్రామంలో పొగాకు బ్యారెన్ దగ్ధమైంది. ఈ ఘటనలో పోతవరం గ్రామానికి చెందిన గద్దె తాతారావుకు చెందిన పొగాకు బేళ్లు కాలిపోయాయి.
తూర్పుగోదావరి జిల్లా, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరం గ్రామంలో పొగాకు బ్యారెన్ దగ్ధమైంది. ఈ ఘటనలో పోతవరం గ్రామానికి చెందిన గద్దె తాతారావుకు చెందిన పొగాకు బేళ్లు కాలిపోయాయి. మురసు తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు తాతారావు పొగాకు బేళ్లు తడిసి ముద్దయ్యాయి.
తడిసిపోయిన పొగాకులో ఉన్న చెమ్మను తొలగించేందుకు మళ్లీ బ్యారెన్‌లో పెట్టి క్యూరింగ్ చేస్తుండగా భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.10 లక్షల విలువైన పొగాకు బేళ్లు కాలిపోయాయి. సమాచారం అందగానే తాడేపల్లిగూడెం అగ్నిమాపక శాఖ సిబ్బంది హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. ఫైర్ సిబ్బంది చర్యలతో మంటలు అదుపులోకి వచ్చాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీలో పల్లె పోరుకు ముహూర్తం ఖరారు.. ఈ నెల 13న షెడ్యూల్
దేశ నిర్మాణంలో అడ్వాణీ సేవలు వెలకట్టలేనివి: సీఎం చంద్రబాబు
కృష్ణా జిల్లాలో అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి.. పాఠశాలపై తల్లిదండ్రుల అనుమానం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News