Share News

కృష్ణా జిల్లాలో అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి.. పాఠశాలపై తల్లిదండ్రుల అనుమానం

ABN , Publish Date - Nov 08 , 2026 | 12:16 PM

కృష్ణా జిల్లా మోపిదేవి మండలం వార్పూలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో నాగాయలంక మండలం ఈలచెట్లదిబ్బకు చెందిన విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఫ్యాన్‌కు ఊరి వేసుకుని విద్యార్థి లంకె కుమార్ రాజా (15) మృతి చెందాడని పాఠశాల యాజమాన్యం చెబుతోంది.

కృష్ణా జిల్లాలో అనుమానాస్పద స్థితిలో  విద్యార్థి  మృతి.. పాఠశాలపై తల్లిదండ్రుల అనుమానం
Krishna District Student Suspicious Death

కృష్ణా జిల్లా, అవనిగడ్డ, నవంబరు 8(ఆంధ్రజ్యోతి): కృష్ణా జిల్లా మోపిదేవి మండలం వార్పూలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో నాగాయలంక మండలం ఈలచెట్లదిబ్బకు చెందిన విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఫ్యాన్‌కు ఊరి వేసుకుని విద్యార్థి లంకె కుమార్ రాజా (15) మృతిచెందాడని పాఠశాల యాజమాన్యం చెబుతోంది. ఈ స్కూల్లో విద్యార్థి పదోతరగతి చదువుతున్నాడు. సమాచారం అందగానే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. హాస్టల్ సిబ్బందే తమవాడిని చంపి, ఉరివేసి ఉంటారని తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తున్నారు. అవనిగడ్డలోని ప్రభుత్వ హాస్పటల్ ఎదుట రోడ్డుపై బైఠాయించి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేపట్టారు. దీంతో అవనిగడ్డ - నాగాయలంక ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం నెలకొంది. తమ కుమారుడి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మృతుడి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్ బాబు, ఏపీ మత్స్య కార సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్ చిలకలపూడి పాపారావు పరామర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

నవంబరు 9 నాటికి పంట నష్టం అంచనాలు పూర్తి చేయాలి.. అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం

ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి

జగన్ చొక్కామడతా పెడతామంటే భయపడే పరిస్థితుల్లో ప్రజలు లేరు: పల్లా శ్రీనివాసరావు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 08 , 2026 | 12:50 PM