నా వ్యాఖ్యలను కొన్ని ఛానెళ్లు వక్రీకరించాయి.. ప్రియాంక తండ్రి ఆవేదన
ABN , Publish Date - Aug 09 , 2026 | 07:19 PM
తాను చేసిన వ్యాఖ్యలను కొన్ని ఛానెళ్లు వక్రీకరించాయంటూ మెడికో ప్రియాంక తండ్రి వెంకటేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.
రాజమహేంద్రవరం, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): తాను చేసిన వ్యాఖ్యలను కొన్ని ఛానెళ్లు వక్రీకరించాయంటూ మెడికో ప్రియాంక తండ్రి వెంకటేశ్ (Medical Student Priyanka Father Venkatesh) ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే బాధలో ఉన్న తమను ఇంకా బాధపెట్టేలా వార్తలను ప్రసారం చేయొద్దని చేతులు జోడించి వేడుకున్నారు. తాను ప్రభుత్వాన్ని, పోలీసులను ఎక్కడా తప్పు పట్టలేదని స్పష్టం చేశారు. నిందితులకు శిక్షపడేలా కఠినమైన సెక్షన్లను ఏపీ ప్రభుత్వం పెట్టిందని తెలిపారు.
తప్పుడు కథనాలు రాయొద్దు..
తాము అనని మాటలను, తమ మనస్సుల్లో లేని మాటలను కూడా కొన్ని ఛానెళ్లు ప్రసారం చేసి తమను ఇబ్బంది పెడుతున్నాయని వెంకటేశ్ అన్నారు. ప్రతి అంశాన్నీ వక్రీకరిస్తూ ఏపీ ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా వార్తలను బ్లూ మీడియా ప్రసారం చేస్తోందని ఆగ్రహించారు. బాధితుల మనోభావాలను దెబ్బతీసేలా తప్పుడు కథనాలు రాయొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రియాంకను కారుతో ఢీకొన్న ఘటనలో పోలీసులు సంతృప్తికరంగా దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.
నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నారు..
తమకున్న సందేహాలను పోలీసులు నివృత్తి చేశారని వెంకటేశ్ అన్నారు. ఈ కేసు దర్యాప్తు జరుగుతున్న తీరును, పెట్టిన సెక్షన్లను అన్నింటిని పోలీసులు తమకు అర్థమయ్యేలా వివరించారని తెలిపారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా ప్రభుత్వం, పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు. పోలీసులు కఠినమైన సెక్షన్లు పెట్టారని వెల్లడించారు. ప్రియాంక కేసులో సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత సహా పోలీసులు స్పందించిన తీరు తమకు సంతృప్తిని ఇస్తోందని వెంకటేశ్ పేర్కొన్నారు.
వార్తలు కూడా చదవండి...
ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు ప్రణాళికతో అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు
వివేకా కేసు.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు వైఎస్ సునీతా సంచలన లేఖ
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. నోటిఫికేషన్ విడుదల
Read Latest AP News And Telangana News And National News
And Telugu News