Share News

విజయవాడ ఉగ్రవాద మూలాల కేసులో కీలక పరిణామం.. బెయిల్‌పై నిందితుల విడుదల

ABN , Publish Date - Nov 10 , 2026 | 11:01 AM

విజయవాడ ఉగ్రవాద మూలాల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి బెయిల్‌పై ఇద్దరు నిందితులు విడుదలయ్యారు.

విజయవాడ ఉగ్రవాద మూలాల కేసులో  కీలక పరిణామం.. బెయిల్‌పై నిందితుల విడుదల
Vijayawada Terror Links Case

తూర్పుగోదావరి జిల్లా, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): విజయవాడ ఉగ్రవాద మూలాల కేసులో (Vijayawada Terror Links Case) కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి బెయిల్‌పై ఇద్దరు నిందితులు విడుదలయ్యారు. ఈ కేసులో A5గా ఉన్న సయేదా బేగం రాజమహేంద్రవరంలోని ప్రత్యేక మహిళా కారాగారం నుంచి విడుదలైంది. రెండు రోజుల క్రితం కేంద్ర కారాగారం నుంచి ఏ4 షాద్‌మాన్ దిల్ఫష్ బెయిల్‌పై విడుదలయ్యాడు.


పాకిస్థాన్ ఉగ్రవాద మూలాలతో సంబంధాలు ఉన్నాయని ఈ ఏడాది మార్చిలో విజయవాడలో పదిమందిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గతంలో వారిని మూడు రోజుల పాటు కస్టడీకి తీసుకుని ఎన్ఐఏ అధికారులు విచారించారు.


నిందితులకు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆరునెలల వరకు నెలకు ఒకసారి హైదరాబాద్‌లోని ఎన్ఐఏ కార్యాలయానికి వచ్చి కనిపించాలనే షరతుతో న్యాయస్థానం నిందితులకు బెయిల్ మంజూరు చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

కూటమి సర్కార్ కీలక నిర్ణయం.. ఏపీ ఎండీసీకి రూ.115 కోట్ల గ్యారెంటీ మంజూరు

స్థానిక ఎన్నికల ఫలితాలను వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.. మంత్రి ఆనం ధ్వజం

సహకార సంఘాల ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం కసరత్తు..!

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 10 , 2026 | 11:16 AM