Share News

దేశాన్ని, హిందూమతాన్ని అవమానించిన వారిని జగన్ వెనకేసుకొస్తున్నారు.. మంత్రి ధ్వజం

ABN , Publish Date - Jul 07 , 2026 | 04:36 PM

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని, హిందూ మతాన్ని అవమానించిన వారిని జగన్ వెనకేసుకొస్తున్నారని ధ్వజమెత్తారు.

దేశాన్ని, హిందూమతాన్ని అవమానించిన వారిని జగన్ వెనకేసుకొస్తున్నారు.. మంత్రి ధ్వజం
AP Minister Kollu Ravindra

రాజమండ్రి, జులై 7 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) మంత్రి కొల్లు రవీంద్ర (AP Minister Kollu Ravindra) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని, హిందూమతాన్ని అవమానించిన వారిని జగన్ వెనకేసుకొస్తున్నారని ధ్వజమెత్తారు. ఈరోజు(మంగళవారం) రంపచోడవరం మండలం పందిరి మామిడిలో నీరా ప్లాంటేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడారు. బీసీలను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యాఖ్యానించారు. జగన్ హయాంలో బీసీలకు ద్రోహం చేశారని దుయ్యబట్టారు. 34 శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 24 శాతానికి తగ్గించారని చెప్పుకొచ్చారు. వైసీపీ హయాంలో 1,608 మంది బీసీలు పదవులు కోల్పోయారని తెలిపారు.


ఏపీకి పెట్టుబడులు రావడం జగన్‌కు ఇష్టం లేదు..

వైసీపీ నేతలు బీసీ రౌండ్‌టేబుల్ పేరుతో కుట్రలు చేస్తున్నారని మంత్రి ఆగ్రహించారు. ఏపీకి పెట్టుబడులు రావడం జగన్‌కు ఇష్టం లేదని దుయ్యబట్టారు. వైసీపీ హయాంలో జరిగిన రూ.3500 కోట్ల లిక్కర్ స్కాం దేశంలోనే పెద్దదని సుప్రీంకోర్టు చెప్పిందని అన్నారు. పనికిరాని బ్రాండ్లతో వేలకోట్లు దోచుకున్నారని ఫైర్ అయ్యారు. నాసిరకం మద్యంతో వేలమందిని పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. వైసీపీని అడ్రస్ లేకుండా చేస్తామని హెచ్చరించారు. కేరళ, గోవా తరహాలో రాష్ట్రంలో బీచ్ షాక్స్ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.


బీచ్ షాక్స్‌లో మద్యం విక్రయాలు..

టూరిజం అభివృద్ధిలో భాగంగా విశాఖపట్నం, సూర్యలంకలో ఫైవ్‌స్టార్ హోటల్స్ ద్వారా బీచ్ షాక్స్‌లో మద్యం విక్రయాలు నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు. బీచ్‌లలో ఎవరికీ ఇబ్బంది లేకుండా నిర్మానుష్య ప్రదేశాల్లో బీచ్ షాక్స్ ఉంటాయని తెలిపారు. అక్టోబర్ నుంచి కొత్త ఎక్సైజ్ విధానం అమల్లోకి తీసుకువస్తామని చెప్పుకొచ్చారు. మద్యం అధిక ధరల అమ్మకాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు చేస్తున్నారని అన్నారు. ఎమ్మార్పీకి మించి అమ్మితే మద్యం షాపులు సీజ్ చేస్తామని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

పీజీఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి: సీఎం చంద్రబాబు

ఐదేళ్లలో 20 వేల స్టార్టప్‌లు, లక్ష ఉద్యోగాలే లక్ష్యం: మంత్రి నారా లోకేశ్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 07 , 2026 | 04:54 PM