పీజీఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jul 06 , 2026 | 04:35 PM
పీజీఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో జీరో వేస్ట్ లక్ష్యమని పేర్కొన్నారు.
అమరావతి, జులై 6 (ఆంధ్రజ్యోతి): పీజీఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. పట్టణ ప్రాంత స్థానిక సంస్థల్లో జీరో వేస్ట్ లక్ష్యమని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈరోజు (సోమవారం) రియల్ టైమ్ గవర్నెన్స్ నుంచి వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు అంశాలపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.
పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలి
పురపాలక, పంచాయతీరాజ్, హోం, ఎక్సైజ్ తదితర శాఖల ద్వారా అందిస్తున్న ప్రభుత్వ సేవలపై ఈ సమావేశంలో సీఎం చర్చించారు. విశాఖపట్నం సముద్రం తీరంలో బోటు మునిగి మత్స్యకారులు గల్లంతైన ఘటనలో తక్షణ స్పందనగా ఏఏ విభాగాలు ఎలా స్పందించాయన్నదే కీలకమని అన్నారు. ఏపీ అభివృద్ధిలో ప్రజాపాలనలో పొలిటికల్ మేనేజ్‌మెంట్ - బ్యూరోక్రటిక్ యాక్షన్ సమపాళ్లలో ఉండాలని దిశానిర్దేశం చేశారు. పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టమ్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
మూడు నెలల్లో యూఎల్‌బీల్లో చెత్త తొలగింపు పనులు చేపట్టాలి..
మూడు నెలల్లో యూఎల్‌బీల్లో చెత్త తొలగింపు పనులు చేపట్టాలని సీఎం చంద్రబాబు మార్గనిర్దేశం చేశారు. గంజాయి నిర్మూలనపై తీసుకుంటున్న చర్యలపై సమాచారం ప్రజల్లోకి వెళ్లేలా చూడాలని నిర్దేశించారు. క్షేత్రస్థాయిలో తాగునీరు, వ్యర్థాల సేకరణకు స్వచ్ఛ రథాలు, ఇంటింటికీ చెత్త సేకరణ లాంటి అంశాల్లో స్పష్టమైన ఎస్ఓపీ జారీ చేయాలని ఆదేశించారు. నెలరోజుల్లోగా అన్ని ప్రభుత్వ శాఖలూ అవేర్ 2.0 ద్వారా ఏ మేరకు ఫలితాలు వచ్చాయో విశ్లేషించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా కమ్యూనికేషన్ నెట్‌వర్క్ కనెక్టివిటీ కోసం మారుమూల ప్రాంతాల్లోని టవర్లను ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
గొడ్డలి పార్టీ మా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయిస్తోంది.. సీఎం చంద్రబాబు ధ్వజం
మత్స్యకారులను రక్షించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నాం: పవన్ కల్యాణ్
Read Latest AP News And And National News
And Telugu News