Share News

మత్స్యకారులను రక్షించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నాం: పవన్ కల్యాణ్

ABN , Publish Date - Jul 05 , 2026 | 12:36 PM

విశాఖ హార్బర్ నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు గల్లంతైన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. సముద్రంలో మత్స్యకారుల గల్లంతుపై ఆరా తీశారు. విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

మత్స్యకారులను రక్షించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నాం: పవన్ కల్యాణ్
AP Deputy CM Pawan Kalyan

అమరావతి జిల్లా, జులై 5 (ఆంధ్రజ్యోతి): విశాఖ హార్బర్ నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు గల్లంతైన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. సముద్రంలో మత్స్యకారుల గల్లంతుపై ఆరా తీశారు. విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మెరైన్ పోలీసులు, కోస్టు గార్డు, నేవీ సహకారం తీసుకోవాలని సూచించారు. గల్లంతైన మత్స్యకారులను రక్షించేందుకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని.. ఆందోళన చెందవద్దని వారి కుటుంబ సభ్యులకు పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు.


విజ‌య‌న‌గ‌రం, విశాఖ క‌లెక్టర్లతో మాట్లాడిన మంత్రి కొండపల్లి, ఎంపీ కలిశెట్టి

భోగాపురం మత్స్యకారులు గల్లంతుపై విజ‌య‌న‌గ‌రం, విశాఖ క‌లెక్టర్లు రామ్ సుంద‌ర్‌రెడ్డి, అభిషిక్త్ కిషోర్‌తో మంత్రి కొండ‌ప‌ల్లి, ఎంపి కలిశెట్టి అప్పలనాయుడు ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మత్స్యకారులను ర‌క్షించేందుకు చేప‌ట్టిన చ‌ర్యల‌ను మంత్రికి వివ‌రించారు క‌లెక్టర్లు. గ‌ల్లంతైన ఏడుగురు మ‌త్స్యకారుల నాయ‌కుడితో ఫోన్లో మాట్లాడినట్లు మంత్రికి, ఎంపీకి వివ‌రించారు క‌లెక్టర్లు. ఏడుగురు మత్స్యకారుల్లో ఆరుగురికి లైఫ్ జాకెట్లు ఉన్నాయ‌ని.. ఒక‌రికి లైఫ్ జాకెట్ లేన‌ట్లుగా చెప్పారు క‌లెక్టర్లు. నేవీ హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన‌ట్లుగా చెప్పారు క‌లెక్టర్లు. స‌ముద్ర తీర ప్రాంతానికి ద‌గ్గర్లోనే ఉండటంతో మ‌త్స్యకారుల‌కు ఎలాంటి ఇబ్బంది ఉండ‌దని మంత్రి తెలిపారు. మ‌త్స్యకారుల‌ను సేఫ్‌గా తీసుకువ‌చ్చేందుకు ప్రభుత్వం ముమ్మరంగా గాలిస్తోంద‌ని మంత్రి కొండపల్లి, ఎంపీ కలిశెట్టి వివరించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

అల్లూరి ఆశయాలే దేశానికి మార్గదర్శకం: పవన్ కల్యాణ్

డ్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేలా తృప్తి క్యాంటీన్‌లను ప్రోత్సహిస్తున్నాం: మంత్రి నారాయణ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 05 , 2026 | 01:02 PM