ఏలూరులో నామినేషన్ల తిరస్కరణ.. పోలీసులతో వైసీపీ నేతల గొడవ
ABN , Publish Date - Oct 24 , 2026 | 07:59 PM
నామినేషన్ తిరస్కరణకు గురైందన్న ఆగ్రహంతో వైసీపీ నేతలు పోలీసులతో గొడవకు దిగారు. ఈ ఘటన ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమలలో చోటుచేసుకుంది.
ఏలూరు జిల్లా, అక్టోబర్ 24: స్థానిక ఎన్నికల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయన్న ఆగ్రహంతో వైసీపీ అభ్యర్థులు పోలీసులతో గొడవకు దిగారు. ఈ ఘటన జిల్లాలోని ద్వారకా తిరుమలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమలలో నామినేషన్ల స్క్రూటినీలో ఎన్నికల సంఘం వైసీపీ అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించింది. దీంతో ఆగ్రహం పట్టలేని.. మండల అధ్యక్షుడు ప్రతాపనేని వాసు తన చొక్కా తానే చింపుకుని పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. దీంతో వైసీపీ నేతలు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ నేపధ్యంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలపై.. ప్రతాపనేని వాసు, జిల్లా ఉపాధ్యక్షుడు బొండాడ వెంకన్నబాబును పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు.. అధికారులకు ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి భారీ వర్ష సూచన
స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు, ఏకగ్రీవాలపై వైసీపీ ఫేక్ ప్రచారాలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News