Share News

తిరుమలను రాజకీయాలకు వేదికగా మార్చొద్దు: భాను ప్రకాశ్ రెడ్డి

ABN , Publish Date - Jul 23 , 2026 | 01:15 PM

తిరుమలను రాజకీయాలకు వేదికగా మార్చొద్దని టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. సనాతన ధర్మాన్ని రాజకీయాలకు వాడొద్దని వైసీపీ నేతలను హెచ్చరించారు.

తిరుమలను రాజకీయాలకు వేదికగా మార్చొద్దు: భాను ప్రకాశ్ రెడ్డి
Bhanu Prakash Reddy

ఢిల్లీ, జులై 23 (ఆంధ్రజ్యోతి): తిరుమలను రాజకీయాలకు వేదికగా మార్చొద్దని టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాశ్ రెడ్డి (Bhanu Prakash Reddy) వ్యాఖ్యానించారు. సనాతన ధర్మాన్ని రాజకీయాలకు వాడొద్దని వైసీపీ నేతలను హెచ్చరించారు. ఆంజనేయస్వామి విగ్రహాన్ని 24 గంటల్లోనే పున: ప్రతిష్ఠించామని స్పష్టం చేశారు. ఢిల్లీ వేదికగా మీడియాతో భాను ప్రకాశ్ రెడ్డి ఈరోజు(గురువారం) మాట్లాడారు. వైసీపీ హయాంలో దేవాలయాలపై దాడులు జరిగాయని విమర్శించారు.


కరుణాకర్ రెడ్డి ఆధారాలతో మాట్లాడాలని భాను ప్రకాశ్ రెడ్డి సవాల్ చేశారు. టీటీడీ నిధుల మళ్లింపుపై వైసీపీని ప్రశ్నించారు. ఎన్డీఏ హయాంలో దేవాలయాల పరిపాలన పారదర్శకంగా సాగుతోందని వ్యాఖ్యానించారు. ఏ అంశంపైనా బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. అసత్య ప్రచారాలు మానుకోవాలని వైసీపీ నేతలను భాను ప్రకాశ్ రెడ్డి హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. ఏపీ కీలక ప్రాజెక్టులపై చర్చ

తమ్మినేని సీతారాం భూ భాగోతాలపై విచారణ చేస్తున్నాం: అచ్చెన్నాయుడు

ఆ మైదానంలో ఆక్రమణలు లేకుండా చర్యలు: మంత్రి టీజీ భరత్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Jul 23 , 2026 | 01:48 PM