Share News

వినాయక చవితి వేడుకల్లో డీజేలకు అనుమతి లేదు: ఎస్పీ సుబ్బరాయుడు

ABN , Publish Date - Sep 14 , 2026 | 07:26 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో వినియోగించే డీజేలకు అనుమతి లేదని ఎస్పీ సుబ్బరాయుడు స్పష్టం చేశారు.

వినాయక చవితి వేడుకల్లో డీజేలకు అనుమతి లేదు: ఎస్పీ సుబ్బరాయుడు
Tirupati SP Subbarayudu

తిరుపతి జిల్లా, సెప్టెంబర్ 14 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో వినియోగించే డీజేలకు అనుమతి లేదని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు (Tirupati SP Subbarayudu) స్పష్టం చేశారు. గణేశ్ వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సౌండ్ సిస్టమ్‌ల వినియోగంలో నిర్దేశిత శబ్ద పరిమితులను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ట్రాఫిక్, ప్రజాభద్రతకు ఎలాంటి విఘాతం కలగకుండా చూసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. తిరుపతి జిల్లావ్యాప్తంగా ముందుస్తు చర్యలు చేపట్టామని, వివాదాలు లేదా అవాంఛనీయ పరిస్థితులపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సుబ్బరాయుడు పిలుపునిచ్చారు.


కాణిపాకంలో వైభవంగా వినాయక చవితి వేడుకలు

చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో వినాయక చవితి వేడుకలు వైభవంగా మొదలయ్యాయి. రేపటి నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కాణిపాకం ఆలయ పరిసరాలు శోభాయమానంగా మారాయి. ఆలయంలో వివిధ పుష్పాలంకరణలు, వివిధ రూపాల్లో బొజ్జ గణపయ్య ప్రతిమలను ఏర్పాటు చేశారు. స్వామివారికి పట్టువస్త్రాలను ఏపీ ప్రభుత్వం తరఫున దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అందజేయనున్నారు. ఉభయదారుల ఆధ్వర్యంలో తొలి పూజా కార్యక్రమం మొదలైంది. ఈ క్రమంలోనే కాణిపాకానికి భక్తులు పొటెత్తుతున్నారు. 21 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

‘నేతన్న సేవ’ కింద ఒక్కో నేతన్నకు రూ.25 వేల ఆర్థిక సాయం: మంత్రి జనార్దన్ రెడ్డి

గణేశ్ విగ్రహాల ఏర్పాటుకు సింగిల్ విండో విధానంలో అనుమతులు: మంత్రి ఆనం

బాలిక గర్భం దాల్చిన ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 14 , 2026 | 07:40 AM