రద్దైన రైళ్ల రాకపోకలు ప్రారంభం
ABN , Publish Date - Oct 29 , 2026 | 10:05 AM
రాష్ట్రంలో ఆర్నబ్ తుఫాన్ కారణంగా తిరుపతి - కాకినాడ మధ్య రద్దు చేసిన రైళ్లను తిరిగి పునరుద్ధరించినట్టు జోనల్ రైల్వే అధికారులు తెలిపారు.
తిరుపతి: రాష్ట్రంలో ఆర్నబ్ తుఫాన్ కారణంగా తిరుపతి - కాకినాడ మధ్య రద్దు చేసిన రైళ్లను తిరిగి పునరుద్ధరించినట్టు జోనల్ రైల్వే అధికారులు తెలిపారు. గుంతకల్లు నుంచి విశాఖపట్టణం, తిరుపతి నుంచి కాకినాడ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్లు యధావిధిగా నిర్ణీత సమయానికి బయలుదేరినట్లు వెల్లడించారు. విశాఖపట్టణం నుంచి గుంతకల్లు వెళ్లాల్సిన తిరుమల ఎక్స్‌ప్రెస్ తిరుపతి నుంచి గురువారం పునరుద్ధరిస్తారు. అలాగే తిరుపతి నుంచి కాకినాడ వెళ్లాల్సిన ఎక్స్‌ప్రెస్ గురువారం రాత్రి బయలు దేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి గొట్టిపాటి పర్యటన..
బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్‌లోఉద్యోగి అనుమానాస్పద మృతి
Read Latest AP News And Telangana News And International News And Telugu News