బీజేపీకి షాక్.. నాగ్‌పూర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీటు కాంగ్రెస్ వశం
ABN , Publish Date - Oct 29 , 2026 | 08:48 AM
మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార బీజేపీకి కాంగ్రెస్ షాక్ ఇచ్చింది. నాగ్‌పూర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ సీటులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉన్న నాగ్‌పూర్‌లో బీజేపీని కాంగ్రెస్ ఓడించడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార బీజేపీకి కాంగ్రెస్ షాక్ ఇచ్చింది. నాగ్‌పూర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ సీటులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉన్న నాగ్‌పూర్‌లో బీజేపీని కాంగ్రెస్ ఓడించడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హోంటౌన్ కూడా నాగ్‌పూర్. అలాంటి చోట బీజేపీ ఓడిపోవడం ఆ పార్టీకి దిగ్భ్రాంతి కలిగించే విషయం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సున్నా సీట్లు వచ్చాయని అంతకుముందు ట్వీట్ చేసిన సీఎం ఫడ్నవీస్.. తాజా పరిణామం తర్వాత తన ట్వీట్‌ను డిలీట్ చేశారు.
బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఉత్కంఠ పోటీ
నాగ్‌పూర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ సీటులో కాంగ్రెస్ తరపున సిట్టింగ్ ఎమ్మెల్సీ అభిజీత్ వంజారి, బీజేపీ నుంచి సుధాకర్ కోహళె పోటీచేశారు. తన ప్రత్యర్థిపై వంజారి 3,271 ఓట్లతో గెలిచారు. వంజారీకి 67,231 ఓట్లు రాగా, సుధాకర్‌కు 63,690 ఓట్లు వచ్చాయి. సుధాకర్ కోసం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా ప్రచారం చేశారు.
ఎంవీఏకు మూడు స్థానాలుఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) మూడు స్థానాల్లో విజయం సాధించగా, అధికార మహాయుతి కూటమికి చెందిన బీజేపీ, శివసేన చెరో స్థానాన్ని దక్కించుకున్నాయి. బుధవారం జరిగిన ఓట్ల లెక్కింపులో నాగ్‌పూర్ సహా మూడు స్థానాల ఫలితాలను అధికారికంగా ప్రకటించారు. పుణె గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో ఎన్సీపీ (శరద్ పవార్) అభ్యర్థి విజయం సాధించారు. ఛత్రపతి సంభాజీనగర్ (ఔరంగాబాద్) గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలోనూ ఎన్సీపీ (శరద్ పవార్) ఆధిక్యంలో ఉంది. కాగా.. పుణె, నాగ్‌పూర్, ఛత్రపతి సంభాజీనగర్ గ్రాడ్యుయేట్స్, పుణె టీచర్, అమరావతి టీచర్ల నియోజకవర్గాలకు ఈనెల 23న పోలింగ్ నిర్వహించారు. ఆ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీల పదవీకాలం డిసెంబర్ 6తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించారు.
ఇవి కూడా చదవండి...
కాకినాడ సముద్రంలో కొట్టుకుపోయిన కార్గో నౌక