Share News

డిజిటల్ జనాభా లెక్కల్లో ఓబీసీ కులాల నమోదు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు

ABN , Publish Date - Oct 28 , 2026 | 01:54 PM

2027 డిజిటల్ జనాభా లెక్కల ఫారమ్‌లో ఓబీసీ కులాల నమోదు కోసం ప్రత్యేక డ్రాప్‌డౌన్ మెనూ ఏర్పాటు చేయాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టు స్పందించింది.

డిజిటల్ జనాభా లెక్కల్లో ఓబీసీ కులాల నమోదు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
OBC Caste Dropdown Menu Census 2027

ఢిల్లీ, అక్టోబర్ 28: 2027లో నిర్వహించనున్న డిజిటల్ జనాభా లెక్కల ఫారమ్‌లో ఇతర వెనుకబడిన తరగతుల (OBC) కులాల నమోదు కోసం ప్రత్యేకంగా 'డ్రాప్-డౌన్ మెనూ'ను ఏర్పాటు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ రోజు కీలక సూచనలు చేసింది.

డిజిటల్ పద్ధతిలో జనాభా లెక్కలు సేకరించే సమయంలో ఓబీసీ కులాల పేర్లు స్పష్టంగా నమోదయ్యేలా డిజిటల్ ఫారమ్‌లో ఒక ప్రత్యేక 'డ్రాప్-డౌన్ మెనూ'ను చేర్చాలని పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు.

జనాభా లెక్కల విధాన రూపకల్పన, డిజిటల్ ఫార్మాట్‌ను నిర్ణయించడం అనేది పూర్తిగా సంబంధిత జనాభా లెక్కల అధికారుల పరిధిలోని అంశమని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ అంశంపై నేరుగా సెన్సస్ అధికారులకే వినతిపత్రం సమర్పించాలని పిటిషనర్‌కు కోర్టు సూచించింది.

డిజిటల్ జనాభా లెక్కల్లో ఓబీసీల వివరాల నమోదుకు సాంకేతికంగా ఎలాంటి విధానం ఉండాలనేది న్యాయస్థానాల పరిధి కాదని, సంబంధిత అధికారులే దీనిపై నిర్ణయం తీసుకుంటారని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది.(OBC Caste Dropdown Menu Census 2027)


ఇవి కూడా చదవండి...

యానాంలో ఆర్నబ్ తుఫాను విలయం

కాకినాడ సముద్రంలో కొట్టుకుపోయిన కార్గో నౌక

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 28 , 2026 | 02:41 PM