మోదీ సీటులో ఎస్పీ పాగా.. వారణాసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎస్పీ విజయం
ABN , Publish Date - Oct 28 , 2026 | 01:31 PM
ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ 4 సీట్లను నిలబెట్టుకుంది. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) రెండు చోట్ల విజయం సాధించింది. బీజేపీ నిలబెట్టుకున్న స్థానాల్లో మీరట్, బరేలీ-మొరాదాబాద్ టీచర్ల సీటు, లక్నో టీచర్స్ సీటు ఉన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి షాక్ తగిలింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గం సీటులో ఎస్పీ విజయం సాధించింది. అంతేకాకుండా ఆగ్రాలోని గెలుపొందింది. 5 గ్రాడ్యుయేట్, 6 టీచర్ నియోజకవర్గాలకు ఈనెల 23న పోలింగ్ నిర్వహించగా.. ఓట్ల లెక్కింపు బుధవారం ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో బీజేపీ 4 సీట్లను నిలబెట్టుకుంది. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) రెండు చోట్ల విజయం సాధించింది. బీజేపీ నిలబెట్టుకున్న స్థానాల్లో మీరట్, బరేలీ-మొరాదాబాద్ టీచర్ల సీటు, లక్నో టీచర్స్ సీటు ఉన్నాయి. వారణాసి, ఆగ్రా టీచర్ల నియోజకవర్గాల్లో ఎస్పీ గెలుపొందింది. మొత్తం 11 ఎమ్మెల్సీ సీట్లకు బుధవారం లెక్కింపు ప్రారంభించారు. మీరట్-సహరన్పూర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో బీజేపీ సిటింగ్ ఎమ్మెల్సీ దినేష్ గోయల్ గెలుపొందారు. ఎస్పీ అభ్యర్థి ప్రమోద్ సింగ్ భాటీపై 12,855 ఓట్లతో గోయల్ గెలుపొందారు. మీరట్ టీచర్ల నియోజకవర్గంలో ఎస్పీ అభ్యర్థి నితిన్ తోమర్‌పై బీజేపీ అభ్యర్థి శ్రీచంద్ శర్మ 13,241 ఓట్లతో విజయం సాధించారు.
అలాగే బరేలీ-మొరాదాబాద్ టీచర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి హరి సింగ్ ధిల్లాన్.. ఎస్పీ అభ్యర్థి హాజీ మొహమ్మద్ దానిష్ అక్తర్‌ను ఓడించారు. లక్నో టీచర్ నియోజకవర్గంలో సిటింగ్ బీజేపీ అభ్యర్థి ఉమేష్ ద్వివేదీ.. ఎస్పీ అభ్యర్థి సుశీల్ కుమార్‌పై గెలుపొందారు. కాగా.. వారణాసి టీచర్ నియోజకవర్గంలో ఎస్పీ సిటింగ్ అభ్యర్థి లాల్ బిహారీ యాదవ్.. బీజేపీ అభ్యర్థి ప్రమోద్ మిశ్రాను 4900 ఓట్ల తేడాతో ఓడించారు. ఆగ్రా టీచర్ నియోజకవర్గంలో ఎస్పీ అభ్యర్థి ఆకాష్ అగర్వాల్.. బీజేపీ అభ్యర్థి హరికిశోర్ తివారీపై విజయం సాధించారు. కాగా.. 5 గ్రాడ్యుయేట్, 6 టీచర్ నియోజకవర్గాలకు ఈనెల 23న పోలింగ్ నిర్వహించారు. 11 సీట్లలో 6 సీట్ల ఫలితాలు తేలగా.. మిగతా చోట్ల కౌంటింగ్ కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి..
భవనంపై నుంచి దూకి శాస్త్రవేత్త ఆత్మహత్య
రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ సభకు అనుమతి.. షరతులు విధించిన ఢిల్లీ పోలీసులు