Share News

అనవసర వాదనలకు తావు లేదు

ABN , Publish Date - Oct 28 , 2026 | 06:30 AM

తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన ఓటుకు నోటు కేసులో చాలా కాలం తర్వాత అకస్మాత్తుగా ఇంటర్వెన్షన్లు తెరపైకి వస్తుండటం వల్ల అసలు కేసు విచారణకు ఆటంకం కలుగుతోందని సుప్రీం కోర్టు ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.

అనవసర వాదనలకు తావు లేదు
Supreme Court

ఓటుకు నోటు కేసులో సుప్రీం కోర్టు స్పష్టీకరణ

న్యూఢిల్లీ, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైన ఓటుకు నోటు కేసులో చాలా కాలం తర్వాత అకస్మాత్తుగా ఇంటర్వెన్షన్లు తెరపైకి వస్తుండటం వల్ల అసలు కేసు విచారణకు ఆటంకం కలుగుతోందని సుప్రీం కోర్టు ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసులో అనవసర వాదనలకు తావు లేకుండా కేవలం అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 12 వర్తింపు, దాని పరిధికి సంబంధించి స్పష్టమైన, చట్టపరమైన అంశంపైనే విచారణ కొనసాగిస్తామని స్పష్టం చేసింది. తదుపరి విచారణను నవంబరు 16వ తేదీకి వాయిదా వేసింది. 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు లంచం ఇస్తూ రేవంత్‌ రెడ్డి పట్టుబడినట్లు ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసును ఎన్నికల చట్టాల నియామావళి కింద కాకుండా అవినీతి నిరోధక చట్టం కింద నమోదు చేశారని, ఆ కేసు చెల్లదని 2021లో రేవంత్‌ రెడ్డి సుప్రీం కోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ (క్రిమినల్‌) దాఖలు చేశారు. ‘‘అవినీతి నిరోధక చట్టం-1988లోని సెక్షన్లు 7,11 కింద లంచం తీసుకోవడం నేరం. అంతేతప్ప లంచం ఇవ్వడానికి కుట్ర చేశారనడం ఆ సెక్షన్ల కింద చెల్లదు. ఆ తర్వాత.. 2018లో లంచం ఇవ్వడం, అందుకు ప్రేరేపించడం వంటివి కూడా నేరంగా పరిగణించేలా సెక్షన్‌ 8ని సవరించారు. కేసును 2015లో నమోదు చేసినందున అప్పటి చట్టాలే వర్తిస్తాయి. అలాగే, సెక్షన్‌ 7, 11, 12 ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి మాత్రమే వర్తిస్తాయి. మండలి ఎన్నికల్లో ఓటు వేయడం లేదా ఓటు వేయకపోవడం అనేది ఈ చట్టం పరిధిలోకి రాదు.


కావున, నిబంధనలకు విరుద్ధంగా నమోదు చేసిన కేసు చెల్లదు’’ అని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో తన పేరునూ తొలగించాలని కోరుతూ సండ్ర వెంకట వీరయ్య సైతం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే మరోసారి ఈ పిటిషన్లు మంగళవారం సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని జస్టిస్‌ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్‌ వి.మోహనల త్రిసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చాయి.

ఇవి కూడా చదవండి..

భవనంపై నుంచి దూకి శాస్త్రవేత్త ఆత్మహత్య

రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ సభకు అనుమతి.. షరతులు విధించిన ఢిల్లీ పోలీసులు

Updated Date - Oct 28 , 2026 | 06:40 AM