Share News

సైబర్‌ నేరగాళ్ల బారిన డాక్టర్‌

ABN , Publish Date - Oct 29 , 2026 | 09:41 AM

ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో సైబర్‌ నేరగాళ్లు ఓ వైద్యుడిని మోసం చేసిన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.

సైబర్‌ నేరగాళ్ల బారిన డాక్టర్‌
cyber crime

  • ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో 1.21 కోట్ల మోసం

హైదరాబాద్: ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో సైబర్‌ నేరగాళ్లు ఓ ఓ వైద్యుడిని మోసం చేసిన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌతంనగర్‌లో ఉండే డాక్టర్‌ (56) ఈ సంవత్సరం ఆగస్టు 11న ఫేస్‌బుక్‌లో ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ పేరుతో వచ్చిన ప్రకటనను చూశాడు. దీనిపై ఆసక్తితో 51 విడతలుగా కొటక్‌మహీంద్ర, ఎస్‌బీఐ ఖాతా నుంచి 1,21,59,801 నగదును బదిలీ చేశారు. అనంతరం లాభాలతో వచ్చిన నగదును విత్‌డ్రా చేసుకుందామని ప్రయత్నించగా వీలుపడటం లేదు. దీంతో మోసపోయినట్లు గ్రహించి సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


city5.2.jpgక్రెడిట్‌ కార్డు పేరుతో..

రూపే క్రెడిట్‌ కార్డు పేరుతో తాను బ్యాంకు ఉద్యోగినని నమ్మించి ఓ ప్రభుత్వ ఉద్యోగి ఖాతా నుంచి నగదు విత్‌డ్రా చేసుకున్న సైబర్‌నేరగాళ్ల సంఘటన మల్కాజిగిరిలో జరిగింది. సఫిల్‌గూడ జైన్‌బాలాజీ గేటెడ్‌ కమ్యునిటీలో నివసించే ప్రభుత్వ ఉద్యోగికి ఐసిఐసిఐ బ్యాంకు నుంచి ఫోన్‌ చేస్తున్నామని కొత్త క్రెడిట్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దీంతో వారు పంపిన ఏపీకే ఫైల్‌ను ఓపెన్‌చేసి తన వ్యక్తిగత వివరాలు తెలిపారు. వెంటనే ఆతని క్రెడిట్‌ కార్డునుంచి 2,40,706 రూపాయలు విత్‌డ్రా అయినట్లు మెసేజ్‌ రావడంతో మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

చనిపోయినా ఎంత బుజ్జిగున్నావ్‌ చిట్టితల్లీ

బహిరంగ మార్కెట్‌లోకి పంప్డ్‌ స్టోరేజీ విద్యుత్‌!

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 29 , 2026 | 09:41 AM