15 నుంచి శబరిమలకి ప్రత్యేక రైళ్లు
ABN , Publish Date - Nov 13 , 2026 | 12:53 PM
శబరిమల భక్తుల సౌకర్యార్థం ఈనెల 15 నుంచి జనవరి 19వ తేదీవరకు ప్రత్యేక రైళ్లు నడపనున్నారు.
తిరుపతి: శబరిమల భక్తుల సౌకర్యార్థం ఈనెల 15 నుంచి జనవరి 19వ తేదీవరకు ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో ఎ.శ్రీధర్ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపారు. హైదరాబాదు, చర్లపల్లి రైల్వేస్టేషన్లనుంచి వివిధ మార్గాల్లో 54 సర్వీసులు నడుపుతున్నామని ఆయన పేర్కొన్నారు.
హైదరాబాదు నుంచి ప్రత్యేక రైలు (07193) డిసెంబరు 5, 12, 19, 26 తేదీల్లో రాత్రి 11.10 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.15 గంటలకు కొళ్లం చేరుకుంటుంది. ఫ కొళ్లంలో ప్రత్యేక రైలు (07194) డిసెంబరు 7, 14, 21, 28 తేదీల్లో ఉదయం 10.55 గంటలకు బయల్దేరి మరుసటిరోజు సాయంత్రం 6.30 గంటలకు హైదరాబాదుకు చేరుకుంటుంది.
చర్లపల్లిలో ప్రత్యేక రైలు(07180) నవంబరు 20, 27, డిసెంబరు 4, 11, 18, 25 తేదీల్లో రాత్రి 11.45 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.55 గంటలకు కొళ్లం చేరుకుంటుంది.
కొళ్లంలో ప్రత్యేక రైలు (07181) నవంబరు 22, 29, డిసెంబరు 6, 13, 20, 27 తేదీల్లో ఉదయం 10.55 గంటలకు బయల్దేరి మరుసటి రోజు రాత్రి ఏడు గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.
చర్లపల్లిలో ప్రత్యేక రైలు (07195) నవంబరు 22, 29, డిసెంబరు 6, 13, 20, 27, జనవరి 3, 10, 17 తేదీల్లో రాత్రి 11.45 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.55 గంటలకు కొళ్లం చేరుకుంటుంది.

కొళ్లంలో ప్రత్యేక రైలు (07196) నవంబరు 24, డిసెంబరు 1, 8, 15, 22, 29, జనవరి 5,12,19 తేదీల్లో ఉదయం 10.55 గంటలకు బయల్దేరి మరుసటి రోజు రాత్రి ఏడు గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.
చర్లపల్లిలో ప్రత్యేక రైలు (07197) డిసెంబరు 2, 9, 16, 23 తేదీల్లో రాత్రి 11.45 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.55 గంటలకు కొళ్లం చేరుకుంటుంది.
కొళ్లంలో ప్రత్యేక రైలు (07198) డిసెంబరు 4, 11, 18, 25 తేదీల్లో ఉదయం 10.55 గంటలకు బయల్దేరి మరుసటి రోజు రాత్రి ఏడు గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.
చర్లపల్లిలో ప్రత్యేక రైలు (07199) డిసెంబరు 30, జనవరి 6, 19 తేదీల్లో రాత్రి 10.40 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.55 గంటలకు కొళ్లం చేరుకుంటుంది.
కొళ్లంలో ప్రత్యేక రైలు (07200) జనవరి 1, 8, 15 తేదీల్లో ఉదయం 10.55 గంటలకు బయల్దేరి మరుసటి రోజు రాత్రి ఏడు గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.
నాందేడ్‌లో ప్రత్యేక రైలు(07189) నవంబరు 15న సాయంత్రం 5.15 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.55 గంటలకు కొళ్లం చేరుకుంటుంది.
కొళ్లంలో ప్రత్యేక రైలు (07190) నవంబరు17న ఉదయం 10.55 గంటలకు బయల్దేరి మరుసటి రోజు రాత్రి ఏడు గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
P4కు కార్పొరేట్ చేయూత.. 25 వేల కుటుంబాలను దత్తత తీసుకున్న ఐటీసీ
విమానాశ్రయాలతో ఆర్థిక ప్రగతి: జీఎంఆర్
Read Latest AP News And Telangana News And International News And Telugu News