P4కు కార్పొరేట్ చేయూత.. 25 వేల కుటుంబాలను దత్తత తీసుకున్న ఐటీసీ
ABN , Publish Date - Nov 13 , 2026 | 11:43 AM
విశాఖలో జరుగుతున్న పెట్టుబడుల సదస్సులో పేదల సంక్షేమం, సాధికారతపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంతోపాటు... పేదలకు సంక్షేమాన్ని అందించేలా భాగస్వామ్య సదస్సు వేదికను సీఎం చంద్రబాబు నాయుడు సద్వినియోగం చేసుకున్నారు.
అమరావతి/విశాఖపట్టణం, నవంబర్ 13: విశాఖలో జరుగుతున్న పెట్టుబడుల సదస్సులో పేదల సంక్షేమం, సాధికారతపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంతోపాటు... పేదలకు సంక్షేమాన్ని అందించేలా భాగస్వామ్య సదస్సు వేదికను సీఎం చంద్రబాబు నాయుడు సద్వినియోగం చేసుకున్నారు. పీ4 ద్వారా పేదలకు చేయూత అందించాలని భాగస్వామ్య సదస్సులోని వివిధ వేదికలపై... కార్పోరేట్ కంపెనీల ప్రతినిధుల వరుస సమావేశాల్లోనూ సీఎం ప్రస్తావిస్తున్నారు. పీ4 కార్యక్రమ వివరాలను తెలుసుకుని ఆర్థిక అసమానతలను తగ్గించే విషయంలో ముఖ్యమంత్రి చొరవను వివిధ కంపెనీల ప్రతినిధులు అభినందిస్తున్నారు.
పీ4 కార్యక్రమం కింద పేదలకు చేయూత ఇచ్చేందుకు 31వ పార్టనర్‌షిప్ సమ్మిట్‌లో వివిధ కార్పోరేట్ కంపెనీలు ముందుకొచ్చాయి. ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఆర్థిక సహకారం అందించడంతో పాటు, బంగారు కుటుంబాలను కార్పోరేట్ సంస్థలు దత్తత తీసుకున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 11.37 లక్షల కుటుంబాలను వివిధ సంస్థలు, వ్యక్తులు దత్తత తీసుకున్నారు. పీ4లో భాగస్వాములై పేదలకు చేయూతనిచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా లక్ష మందికి పైగా మార్గదర్శులు ముందుకు వచ్చారు.
భాగస్వామ్య సదస్సు రెండో రోజున స్వర్ణాంధ్ర ఫౌండేషన్‌తో సీఎం చంద్రబాబు సమక్షంలో కార్పోరేట్ సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల్లో 1120 మంది ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ఆర్థిక సహకారం అందించేందుకు హీరో మోటార్ కార్పోరేషన్‌తో స్వర్ణాంధ్ర ఫౌండేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. రూ.32.48 కోట్ల మేర ఆర్థిక సాయం అందించేలా హీరో మోటార్స్ కార్పోరేషన్ ఎంఓయూ చేసుకుంది. అలాగే ఏపీవ్యాప్తంగా 100 గ్రామాల్లోని 25 వేల మంది బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా ఐటీసీ లిమిటెడ్‌తో స్వర్ణాంధ్ర ఫౌండేషన్ ఒప్పందం చేసుకుంది. దాదాపు 25 వేల మంది బంగారు కుటుంబాలకు జీవనోపాధి, జీవన ప్రమాణాలు పెంచేలా ఒప్పందం కుదర్చుకుంది.
ఇవి కూడా చదవండి...
రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనపై కేటీఆర్ ఫైర్.. రూ.100 కోట్ల ఖర్చుపై ప్రశ్నలు
ఐటీ శకం ముగిసింది.. ఏఐ, క్వాంటం శకం మొదలైంది: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News