పదేళ్లలో ఒక్క గ్రూప్-1 నోటిఫికేషన్ అయినా ఇచ్చారా?.. కేటీఆర్‌పై పొన్నం ఫైర్
ABN , Publish Date - Nov 13 , 2026 | 10:42 AM
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత కేటీఆర్‌కు లేదన్నారు.
హైదరాబాద్, నవంబర్ 13: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అర్హత కేటీఆర్‌కు లేదన్నారు. కాంగ్రెస్‌కు హామీలు ఇవ్వడమే కాదు.. వాటిని అమలు చేసే సత్తా కూడా ఉందన్నారు. అవినీతి గురించి కేటీఆర్ మాట్లాడటం వింతే అంటూ వ్యాఖ్యానించారు. పదేళ్లు అధికారంలో ఒక్క గ్రూప్-1 నోటిఫికేషన్ అయినా ఇచ్చారంటూ ఫైర్ అయ్యారు.
పొన్నం ప్రభాకర్ పోస్ట్..
‘రాహుల్ గాంధీ గురించి మాట్లాడే అంత ఇమేజ్ కేటీఆర్‌కు లేదు. ఆ కుటుంబం మొత్తం త్యాగం చేసిన కుటుంబం. నేరెళ్ల దళితుల దాడి మీ సారథ్యం కాదా? ఖమ్మంలో రైతులకు బేడీలు మీ పాలనలో కాదా? మల్లన్న సాగర్ బాధితుల మీద లాఠీఛార్జ్ మీ పాలనలో కాదా? పదేళ్లు అధికారంలో ఉండి ఒక్క గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చారా? మేము ఇచ్చాం.. నిర్వహించి చూపించాం. మాకు హామీలు ఇవ్వడమే కాదు అమలు చేసే సత్తా కూడా ఉంది. మీలాగ వేల కోట్ల రూపాయల ఆస్తుల సంపాదన మీద ఆసక్తి లేదు.. అవసరం లేదు.. ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తున్నాం. అవినీతి గురించి మీరు మాట్లాడటం అంటే వింతగా ఉంది. ఫార్ములా ఈ రేస్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుందని మీరు. కాళేశ్వరం, విద్యుత్ కొనుగోలు, అసైన్‌ల్యాండ్‌లు.. ఇలా చెప్పుకుంటూ పోతే మీ అవినీతిలెక్కలు చెప్పడానికి ఒక ఏడాది పడుతుంది. మీ ఆధ్వర్యంలో జరిగిన ఆర్భాటాలు.. మా ప్రజా ప్రభుత్వంలో జరుగుతున్న ఏర్పాట్లు.. బేరీజు వేస్తే అబద్ధం కూడా సిగ్గు పడుతుంది’ అంటూ ఎక్స్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి...
విమానాశ్రయాలతో ఆర్థిక ప్రగతి: జీఎంఆర్
మోపిదేవి ఆలయంలో నాగులచవితి వేడుకలు.. తరలివస్తున్న భక్తులు
Read Latest Telangana News And Telugu News