Share News

నాతో చర్చకు వస్తే ప్రధాని పదవిలో మోదీ కొనసాగలేరు.. రాహుల్ గాంధీ సవాల్..

ABN , Publish Date - Nov 13 , 2026 | 12:27 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. తనతో ముఖాముఖి చర్చకు వస్తే మోదీ ప్రధానమంత్రి పదవిలో కొనసాగలేరని వ్యాఖ్యానించారు.

నాతో చర్చకు వస్తే ప్రధాని పదవిలో మోదీ కొనసాగలేరు.. రాహుల్ గాంధీ సవాల్..
Rahul Gandhi

ఇంటర్నెట్ డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. తనతో ముఖాముఖి చర్చకు వస్తే మోదీ ప్రధానమంత్రి పదవిలో కొనసాగలేరని వ్యాఖ్యానించారు. తాజాగా భారత్ జోడో ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన వీడియో సందేశంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మోదీ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా రాహుల్ ఈ సవాల్ విసిరినట్లు తెలుస్తోంది. దీంతో అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ వాగ్వాదం మరోసారి చర్చనీయాంశంగా మారింది (Rahul Gandhi vs Modi).


ప్రధాని మోదీతో ముఖాముఖి చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తమ ఇద్దరి మధ్య నేరుగా చర్చ జరిగితే ప్రధానమంత్రి పదవిలో మోదీ కొనసాగలేరని హామీ ఇస్తానన్నారు. విదేశీ శక్తుల సహకారంతోనే మోదీ ప్రధానమంత్రి అయ్యారని, ఇప్పటికీ ఆ పదవిలో కొనసాగుతున్నారని రాహుల్ గతంలో వ్యాఖ్యానించారు. దేశ ఆర్థిక వ్యవస్థపై విదేశీ శక్తుల ప్రభావం ఉందని, విదేశీ సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా మోదీకి మద్దతుగా పనిచేస్తున్నాయని ఆరోపించారు (Rahul Gandhi Debate Challenge).


ఈ అంశాలపై ప్రధాని మోదీతో బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు రావచ్చని సవాల్ విసిరారు. చర్చకు వేదికను, మధ్యవర్తిని మోదీనే నిర్ణయించుకోవచ్చని కూడా సూచించారు. ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాహుల్ ఈ సవాలు విసిరారు. దీపావళి సందర్భంగా అక్కడ సీఆర్‌పీఎఫ్ జవాన్లతో గడిపిన మోదీ.. దేశంలో సాయుధ నక్సలిజం తగ్గిపోయినప్పటికీ, కొన్ని సంస్థలు, రాజకీయ పార్టీల్లో 'మేధో నక్సల్స్' ఉన్నారని వ్యాఖ్యానించారు (Congress BJP Political News).


రాజ్యాంగం, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని మోదీ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రతిపక్ష నేతలను పరోక్షంగా లక్ష్యంగా చేసుకోవడానికి అధికారిక వేదికలను ఉపయోగించుకుంటున్నారని విమర్శించింది. 'దేశద్రోహులు ఎవరు? విదేశీ శక్తుల ప్రభావంతో పనిచేస్తున్నది ఎవరు?' అనే అంశాలపై మోదీతో బహిరంగ చర్చకు సిద్ధమని రాహుల్ ప్రకటించారు.


ఇవి కూడా చదవండి..

టాయిలెట్ల క్లీనింగ్ నుంచి లక్షల కోట్ల సామ్రాజ్యం వరకు.. జెన్సన్ హువాంగ్ జీవితంలో అనూహ్య మలుపులు!


న్యూజిలాండ్ ఓపెనర్ హాఫ్ సెంచరీ.. 15 ఓవర్లకు కివీస్ స్కోరు 75/2

Updated Date - Nov 13 , 2026 | 12:30 PM