కొండెక్కుతున్న గుడ్డు ధర
ABN , Publish Date - Nov 13 , 2026 | 11:49 AM
సుమారు 3 నెలల పాటు స్ధిరంగా ఉన్న కోడిగుడ్డు ధర కొద్ది రోజులుగా పెరుగుతూ పోతోంది.
ప్రస్తుతం హోల్‌సేల్‌లో డజన్ రూ.96
కొద్ది రోజుల్లోనే రూ.16లు పెరుగుదల
స్టేషన్‌ఘన్‌పూర్(జనగామ): సుమారు 3 నెలల పాటు స్ధిరంగా ఉన్న కోడిగుడ్డు ధర కొద్ది రోజులుగా పెరుగుతూ పోతోంది. హోల్‌సేల్ ధర డజన్ రూ. 80లు ఇంత కాలం పలికిన ధర నాలుగైదు రోజుల క్రితం రూ.90లకు, ప్రస్తుతం రూ. 96లకు చేరింది. స్వల్ప కాలంలోనే ఏకంగా రూ.16లు పెరగడంతో వినియోగదారులు బెంబేలెత్తి పోతున్నారు. కోడి గుడ్డు ధర రిటైల్‌లో రూ.6 నుంచి రూ.7ల మధ్య కదలాడిన ధర ఇప్పుడు రూ.7.5 నుంచి రూ.8లకు చేరుకుంది. ఆ గస్టు మొదటి వారంలో తగ్గిన గుడ్డు ధర రూ.80 వద్ద వారం క్రితం వరకు కొనసాగింది. ఇప్పుడు కొద్ది రోజులుగా మళ్లీ పెరుగుతోంది.
నిత్యవసర ధరలు సైతం
ఐతే ఎల్‌నినో ప్రభావంతో బియ్యం, కూరగాయలు, నిత్యావసరాల ధర లు కూడా గణనీయంగా పెరుగుతున్న విషయం విధితమే. సన్న బియ్యం ధర నెల క్రితం క్వింటాల్ రూ. 5600 నుంచి రూ.6400లు పలికింది. కాగా ప్రస్తుతం రూ. 6600ల నుంచి రూ.8000ల వరకు చేరుకుంది. కూర గాయల ధర కూడా కిలోకు రూ. 20 నుంచి రూ.60లకు పెరగడం గమ నార్హం. నూనెలు, పప్పుల ధరలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. దానిలో భాగంగానే కోడి గుడ్డు ధరలు పెరుగుతున్నాయని పలువురు భావిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
42 రోజులకే నీళ్లు..సీటీలో 3లక్షల కనెక్షన్లకు నీటి కటకట తప్పదా?
ఫ్లాట్లు నిర్మించకుండానే రిజిస్ట్రేషన్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News