‘ఫ్యూచర్’ పనులు చకచకా..
ABN , Publish Date - Nov 13 , 2026 | 09:43 AM
ప్రభుత్వం హైదరాబాద్ దక్షిణ భాగంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో గ్లోబల్ సిటీ నిర్మించేందుకు మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేసింది.
గ్లోబల్ సమ్మిట్‌కు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీ ముస్తాబు
డిసెంబరులోగా పనులు పూర్తి చేసేందుకు కసరత్తు
గ్లోబల్ సమ్మిట్ నాటికి రతన్‌టాటా రేడియల్ రోడ్డు
దేశ, విదేశాల ప్రతినిధుల వాహనాలు నేరుగా చేరేలా ఏర్పాటు
రంగారెడ్డి అర్బన్: ప్రభుత్వం హైదరాబాద్ దక్షిణ భాగంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో గ్లోబల్ సిటీ నిర్మించేందుకు మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేసింది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ (ఫైనాన్సియల్ డిస్ర్టిక్ట్) మాదిరిగానే ఫోర్త్ సిటీని నిర్మించనుంది. ప్రపంచంలోని ప్రముఖ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ఆకర్శించేందుకు తగిన చర్యలు తీసుకుంటోంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0ను డిసెంబరులో ప్రపంచస్థాయి ప్రమాణాలతో నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఫ్యూచర్‌సిటీ డెవల్‌పమెంట్ పరిధిలో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ప్రధానంగా రోడ్ నెట్ వర్క్‌పై ఫోకస్ పెట్టింది. ఫ్యూచర్ సిటీ మీదుగా ప్రభుత్వం అధునిక ఎక్స్‌ప్రెస్ వేను నిర్మిస్తోంది.
అంతర్జాతీయ ప్రమాణాలతో రతన్‌టాటా గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అవుటర్‌రింగ్‌రోడ్డు ఎగ్జిట్-13నుంచి గ్లోబల్ సమ్మిట్ వేదిక వరకు ఈ రోడ్డును అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో పనిచేస్తోంది. రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.4,621 కోట్ల మేరకు అంచనా వేసి పనులు ప్రారంభించింది. పలుచోట్ల రైతులు రోడ్డు నిర్మాణం కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. రిత్విక్ ప్రాజెక్టు కాంట్రాక్టు పనులు దక్కించుకుంది. డిసెంబరులో నిర్వహించే గ్లోబల్ సమ్మిట్‌కు దేశ, విదేశాల పారిశ్రామికవేత్తల వాహనాలను ఓఆర్‌ఆర్ ఎగ్జిట్-13 నుంచి నేరుగా స్కిల్ యూనివర్సిటీ వరకు వచ్చేలా పనులు వేగవంతం చేస్తున్నారు. .
డ్రోన్ సర్వే
సాంప్రదాయ పద్ధతులతో పోలిస్తే, తక్కువ సమయంలో, కచ్చితత్వంతో కూడిన భౌగోళిక(జీయోస్పెషియల్)డేటాను డ్రోన్ సర్వే ద్వారా సేకరించేందుకు ఎఫ్‌సీడీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎఫ్‌సీడీఏ పరిధిలో యాచారం, ఆమన్‌గల్, మహేశ్వరం, కందుకూరు, కడ్తాల్ మండలాల పరిధిలో 71 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల్లో భవిష్యత్‌లో చేపట్టనున్న ప్రాజెక్టులపై డ్రోన్ సర్వే చేపడుతున్నారు. గ్రామాల వారీగా ఉన్న వనరులపై నివేదికలు సిద్ధం చేయనున్నారు.
లింకు రోడ్ల అభివృద్ధి
ఫ్యూచర్‌సిటీలో అంతర్గత పారిశ్రామిక, ఐటీ, నివాస ప్రాంతాలను సిగ్నల్స్ రహిత జంక్షన్లతో పాటు జాతీయ, రాష్ట్ర రహదారులకు ఒకదానితో ఒకటి అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. బెంగుళూరు జాతీయరహదారి-844, శ్రీశైలం జాతీయ రహదారి-765 నుంచి నాగార్జునసాగర్ రహదారికి అనుసంధానాన్ని మెరుగుపరిచేందుకు, కీలకమైన లింకురోడ్లును అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఎఫ్‌సీడీఏ పరిధిలోని లింకురోడ్ల విస్తరణ, అభివృద్ధితోపాటు కల్వర్టుల విస్తరణకు రూ.140కోట్లు విడుదల చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి:
పసిడి ధరలు తగ్గుతూనే ఉన్నాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
ఫ్లాట్లు నిర్మించకుండానే రిజిస్ట్రేషన్లు
Read Latest AP News And Telangana News And International News And Telugu News