Share News

పెరిగిన పాల ధరలు.. పోషకాల కోసం ప్రత్యామ్నాయాలు ఇవే!

ABN , Publish Date - Nov 13 , 2026 | 08:40 AM

దేశవ్యాప్తంగా పలు డైయిరీ దిగ్గజాలు పాల ధరలను పెంచుతున్నట్టు తాజాగా ప్రకటించాయి. ఇప్పటికే నిత్యవసర సరుకుల ధరల పెరుగుదలతో సామాన్య వినియోగదారులు సతమతమవుతున్నారు.

పెరిగిన పాల ధరలు.. పోషకాల కోసం ప్రత్యామ్నాయాలు ఇవే!

ఇంటర్నెట్ డెస్క్: దేశవ్యాప్తంగా పలు డైయిరీ దిగ్గజాలు పాల ధరలను పెంచుతున్నట్టు తాజాగా ప్రకటించాయి. ఇప్పటికే నిత్యవసర సరుకుల ధరల పెరుగుదలతో సామాన్య వినియోగదారులు సతమతమవుతున్నారు. ఇప్పుడు పాల ధరలూ పెరగడంతో వారి గుండెల్లో రాయి పడినట్టైంది. పాలను ఇష్టంగా తాగేవారు రేటు పెరిగినా వాటిని వదల్లేరు. అయితే పాలను కేవలం పోషకాల కోసం సేవించేవారికి ప్రత్యామ్నాయ మార్గాలు ఉండనే ఉన్నాయి. పాలు అందించే ప్రయోజనాలు అవీ ఇస్తాయి.


ప్రోటీన్ కోసం ఇవి..

మినుములు, చిక్కుడు గింజలు, శనగలు, వేరుశనగలు ప్రోటీన్‌కు మంచి వనరులు. వీటిని రోజువారీ ఆహారంలో తీసుకుంటే సరిపడా ప్రోటీన్ శరీరానికి చేరుతుంది. మినుములను నానబెట్టి లేదా ఉడికించుకుని తింటే పోషకాలు అందుతాయి. వేరుశనగ ధరలో తక్కువైనా ప్రోటీన్ విషయంలో ఏమాత్రం తీసిపోదు. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులూ ఉన్నాయి.

కాల్షియం కోసం ఈ పదార్థాలు..

నువ్వులలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. వీటితో ఉండలు చేసుకుని తినడం మంచిది. అలాగే రాగిపిండిలో కాల్షియం ఎక్కువ మోతాదులో లభిస్తుంది. రాగి రొట్టెలు తినడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు.

విటమిన్-డీ కోసం..

విటమిన్-డీ కోసం పుట్టగొడుగులు తీసుకోవచ్చు. అయితే ఇవి పాల కంటే ఖరీదైనవి. కాబట్టి తక్కువ ధరలో విటమిన్-డీ కావాలనుకుంటే కోడి గుడ్లు మంచి ఎంపిక. ఇవి విటమిన్-డీతో పాటు ప్రోటీన్‌ కూడా అందిస్తాయి.


ఇవీ చదవండి

ఒక్క క్యాప్సికమ్‌లో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..!

పిల్లల్లోనూ గుండెపోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు!

Updated Date - Nov 13 , 2026 | 08:45 AM