Share News

ఒక్క క్యాప్సికమ్‌లో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..!

ABN , Publish Date - Nov 13 , 2026 | 07:09 AM

క్యాప్సికమ్ తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయండోయ్. అందులోని పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

ఒక్క క్యాప్సికమ్‌లో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..!

ఇంటర్నెట్ డెస్క్: కొందరు క్యాప్సికమ్ తినడానికి ఇష్టపడరు. అయితే దీన్ని తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చలికాలంలో ఈ కూరగాయను తీసుకోవడం మంచిదని వివరిస్తున్నారు. క్యాప్సికమ్‌లో విటమిన్ సీ, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే ఈ కూరగాయను తప్పనిసరిగా ఆహారంలో భాగంగా చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


బరువు నియంత్రణ

బరువు తగ్గాలనుకునే వారికి క్యాప్సికమ్ సహాయపడుతుంది. ఇందులో తక్కువ కేలరీలు, ఎక్కువ పీచుపదార్థం ఉంటాయి. ఈ కూరగాయలో నీటి శాతం కూడా ఎక్కువే. దీన్ని సలాడ్, ఆకుకూరలు లేదా సూప్ రూపంలో తీసుకోవచ్చు. అధిక నీటి శాతం కారణంగా క్యాప్సికమ్ తక్కువగా తిన్నా కడుపు నిండిన భావన ఏర్పడుతుంది. దీంతో బరువు నియంత్రణ సాధ్యమవుతుంది.

రోగనిరోధక శక్తి

క్యాప్సికమ్‌లో విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచీ కాపాడతాయి. రోగనిరోధక వ్యవస్థకు విటమిన్ సీ చాలా అవసరం.


గుండె ఆరోగ్యం

క్యాప్సికమ్‌లో పొటాషియంతో సహా కొన్ని ఖనిజాలు ఉన్నాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, రక్తపోటును నియంత్రించడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. అయితే కేవలం క్యాప్సికమ్ తినడం ద్వారా అన్ని గుండె జబ్బులూ తగ్గిపోతాయని భావించకూడదు.

ఐరన్ అందిస్తుంది..

శరీరానికి ఐరన్ అవసరం. క్యాప్సికమ్‌లో ఈ ఐరన్ కొద్ది మొత్తంలో ఉంటుంది. అందుకే ఈ కూరగాయను పప్పులు, ఆకుకూరలతో కలిపి తీసుకోవడం మంచిది.

క్యాప్సికమ్‌ను పప్పులు, సూప్‌లు, సాంబార్లు లాంటి వంటకాలలో చేర్చుకోవచ్చు. దీనిని ఎక్కువగా ఉడికించకుండా తినాలి. అప్పుడే విటమిన్ సీ శరీరానికి అందుతుంది. సమతుల్య ఆహారంలో భాగంగా క్యాప్సికమ్‌ను తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.


ఇవీ చదవండి

శీతాకాలంలో సీతాఫలం తింటే బోలెడు ప్రయోజనాలు

బీట్‌రూటు మారుతోంది!

Updated Date - Nov 13 , 2026 | 07:15 AM