Share News

శీతాకాలంలో సీతాఫలం తింటే బోలెడు ప్రయోజనాలు

ABN , Publish Date - Nov 12 , 2026 | 08:04 AM

శీతాకాలంలో లభించే సీతాఫలం రుచితోపాటు పోషకాలను అందిస్తుంది. ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్ సీ, బీ6, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

శీతాకాలంలో సీతాఫలం తింటే బోలెడు ప్రయోజనాలు

ఇంటర్నెట్ డెస్క్: శీతాకాలంలో లభించే సీతాఫలం రుచితోపాటు పోషకాలను అందిస్తుంది. ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్ సీ, బీ6, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.


జీర్ణక్రియ

సీతాఫలంలో పీచుపదార్థం బాగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మలవిసర్జనను సులభతరం చేస్తుంది. పీచుపదార్థం కారణంగా మలబద్ధకం సమస్య తగ్గిపోతుంది.

గుండె ఆరోగ్యం

సీతాఫలంలోని పొటాషియం, మెగ్నీషియం సాధారణ కండరాల పనితీరును మెరుగుపరుస్తాయి. రక్తపోటును నియంత్రించటంలోనూ ఈ పండు కీలక పాత్ర పోషిస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.


కండరాలకు పోషకాలు

సీతాఫలంలో మెగ్నీషియం ఉందన్న విషయం తెలిసిందే. అలాగే ఇందులో కొద్ది మొత్తంలో కాల్షియమూ ఉంది. ఈ రెండూ.. కండరాలకు తగిన పోషకాలను అందిస్తాయి.

రోగనిరోధక శక్తి పెరుగుదల

ఈ పండులోని విటమిన్ సీ శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్ గుణాలు కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కాపాడతాయి.

చర్మ సౌందర్యం

శరీరానికి కొల్లాజెన్ చాలా అవసరం. ఇది చర్మ ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. ఈ కొల్లాజెన్ ఉత్పత్తికి విటమిన్ సీ సహాయపడుతుంది. అందుకే చర్మ ఆరోగ్యం కోసం సీతాఫలం తీసుకోవాలి.

వీరు మితంగా తీసుకోవాలి

సీతాఫలంలో సహజ చక్కెర ఉంటుంది. కాబట్టి మధుమేహం ఉన్న వారు దీన్ని మితంగా తీసుకోవాలి. అలాగే ఈ పండులోని గింజలు తినదగినవి కావు.


ఇవీ చదవండి

పిల్లల్లోనూ గుండెపోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయొద్దు!

పసుపు పాలు.. ఆరోగ్యానికి ఎంతో మేలు

Updated Date - Nov 12 , 2026 | 08:11 AM