Share News

పసుపు పాలు.. ఆరోగ్యానికి ఎంతో మేలు

ABN , Publish Date - Nov 08 , 2026 | 07:21 AM

పసుపు పాలు తాగితే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసా..?

పసుపు పాలు.. ఆరోగ్యానికి ఎంతో మేలు

ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా పాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిలో కాల్షియం, ఐరన్, ప్రోటీన్ వంటి అనేక పోషకాలుంటాయి. ఇవి శరీరానికి పోషణను అందిస్తాయి. అయితే పాలలో కాస్త పసుపు కలిపి తాగితే.. ఆరోగ్యానికి ఇంకా మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ పాలను తాగటం వల్ల అనేక ప్రయోజనాలున్నాయని వివరిస్తున్నారు. ఇంతకీ ఆ ప్రయోజనాలేంటో చూద్దామా..


గుండె ఆరోగ్యం: పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. పసుపు పాలు తాగటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

రోగనిరోధక శక్తి: పసుపు పాలు తాగటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వీటిలో పుష్కలంగా ఉన్న యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు ఇందుకు సహాయపడతాయి.


జీర్ణ వ్యవస్థ: పసుపు పాలను క్రమంగా తీసుకోవటం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగవుతుంది. అజీర్ణం, గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనమూ దొరుకుతుంది.

జలుబు: గోరువెచ్చగా ఉన్న పసుపు పాలు గొంతు నొప్పిని తగ్గిస్తాయి. వీటిలో ఉన్న యాంటీ బాక్టీరియల్, యాంటి వైరల్ గుణాలు.. జలుబు లాంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం అందిస్తాయి. గొంతులో కఫం తగ్గించటంలోనూ పసుపు పాలు కీలక పాత్ర పోషిస్తాయి.

మంచి నిద్ర: రాత్రి ఒక గ్లాసు గోరువెచ్చని పసుపు పాలు తాగటం వల్ల శరీరానికి, మనసుకు మంచి విశ్రాంతి దొరుకుతుంది. దీంతో సెరోటోనిన్ స్థాయిలు పెరిగి, ఒత్తిడి తగ్గుతుంది. తద్వారా గాఢ నిద్ర పట్టే అవకాశాలు పెరుగుతాయి.

పసుపు పాలు.. చేసే తీరు

పసుపు పాలు తయారు చేయడం చాలా సులభం. ఒక కప్పు పాలు తీసుకోండి. దాంట్లో పావు టీస్పూన్ పసుపు కలపండి. దానిని వేడి చేయండి. అంతే పసుపు పాలు రెడీ.


ఇవీ చదవండి

బీట్‌రూటు మారుతోంది!

చలికాలంలో ఈ 7 అలవాట్లతో ఆరోగ్యానికి ముప్పు.. చిన్న నిర్లక్ష్యమే సమస్యలకు కారణం!

Updated Date - Nov 08 , 2026 | 07:29 AM