Share News

రాయలసీమకు భారీ హార్టికల్చర్‌ హబ్.. రూ.లక్ష కోట్లతో ఏర్పాటు: నిర్మలా సీతారామన్‌

ABN , Publish Date - Oct 02 , 2026 | 04:17 PM

రాయలసీమలో గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. రూ.లక్ష కోట్లతో రాయలసీమ ఉద్యాన హబ్‌‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

రాయలసీమకు భారీ హార్టికల్చర్‌ హబ్.. రూ.లక్ష కోట్లతో ఏర్పాటు: నిర్మలా సీతారామన్‌
Union Minister Nirmala Sitharaman

అన్నమయ్య, అక్టోబర్ 2: రాయలసీమలో గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. రాయలసీమ హార్టికల్చర్‌ హబ్‌కు ఈరోజు (శుక్రవారం) శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొని ప్రసంగించారు. రూ.లక్ష కోట్లతో రాయలసీమ ఉద్యాన హబ్‌‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. యూరియా ఒక్కో బ్యాగ్‌కు రూ.300 కంటే ఎక్కువ తీసుకోవద్దని ఆదేశాలిచ్చామన్నారు.


గోవర్ధన్‌ స్కీమ్‌ ద్వారా బయోగ్యాస్‌ ఉత్పాదనకు వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. సూర్యఘర్‌ యోజన, పీఎం కుసుమ్‌ యోజన ద్వారా సోలార్‌ పంపులు ఇచ్చారని.. వీటి ద్వారా ఉచిత విద్యుత్‌ పంపిణీకి ఏర్పాట్లు చేశామని చెప్పారు. పంట నష్టం రాకుండా కిసాన్‌ ఇన్యూరెన్స్‌ స్కీమ్‌ తీసుకొచ్చామని అన్నారు. మత్స్యకారులు, పశుపోషకులకు కొత్త పథకాలు ప్రవేశపెట్టామని చెప్పారు. ప్రతి జిల్లాలో జంతు సంరక్షణ కోసం వెటర్నరీ డాక్టర్‌, మొబైల్‌ యానిమల్‌ ఆస్పత్రి ఏర్పాటు చేయనున్నట్లు నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

రాయలసీమను నీటి సంరక్షణ రీజియన్‌గా తీర్చిదిద్దుతాం: పవన్ కల్యాణ్

పొన్నూరులో రూ.32.10 కోట్ల పనులకు మంత్రి నారాయణ శంకుస్థాపన

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 02 , 2026 | 04:24 PM