రాయలసీమను నీటి సంరక్షణ రీజియన్‌గా తీర్చిదిద్దుతాం: పవన్ కల్యాణ్
ABN , Publish Date - Oct 02 , 2026 | 01:03 PM
రాయలసీమ రైతుకు పట్టుదల ఎక్కువ అని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. కరవులో ఉన్న నేల నేడు అభివృద్ధి పథంలో ముందుకెళ్తోందన్నారు.
అన్నమయ్య, అక్టోబర్ 2: రాయలసీమ రైతుకు పట్టుదల ఎక్కువ అని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఈరోజు(శుక్రవారం) జిల్లాలో రాయలసీమ హార్టికల్చర్ హబ్‌కు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. కరవులో ఉన్న నేల నేడు అభివృద్ధి పథంలో ముందుకెళ్తోందన్నారు. రూ.లక్ష కోట్ల పెట్టుబడితో రాయలసీమ ఉద్యాన హబ్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. రాయలసీమను నీటి సంరక్షణ రీజియన్‌గా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. రాయలసీమలో భూగర్భ జలమట్టాలు సగటున 3.6 మీటర్లు పెరిగాయన్నారు. రాయలసీమలో ఉద్యాన సాగుకు కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. ఇప్పటికే పల్లెపండుగ కార్యక్రమం ద్వారా రాయలసీమలో గత రెండేళ్లలో రూ.8వేల కోట్లకుపైగా అభివృద్ధి పనులను చేపట్టినట్లు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఈరోజు(శుక్రవారం) రాయలసీమ హార్టికల్చర్ హబ్ శంకుస్థాపన జరిగింది. ఈకార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, మంత్రి లోకేశ్, అనంత్ అంబానీ పాల్గొన్నారు. రూ.లక్ష కోట్లతో రాయలసీమ హార్టికల్చర్ హబ్‌ను ఏపీ సర్కార్ ఏర్పాటు చేయనుంది. 10 జిల్లాలు, 201 క్లస్టర్లలో ఉద్యాన అభివృద్ధి చేయనుంది. రాయలసీమ హార్టికల్చర్ హబ్‌కు ప్రభుత్వం నుంచి రూ.40,352 కోట్ల పెట్టుబడి పెట్టనుండగా.. ప్రైవేట్ రంగం నుంచి రూ.60 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు.
ఇవి కూడా చదవండి...
ఏపీ హాస్టల్ విద్యార్థులకు డైట్ ఛార్జీల పెంపుపై మంత్రి సంధ్యారాణి హర్షం
బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు కీలక ఆదేశాలు.. రేపే సుప్రీంకోర్టులో పిటిషన్
Read Latest AP News And Telugu News