ఏపీ హాస్టల్ విద్యార్థులకు డైట్ ఛార్జీల పెంపుపై మంత్రి సంధ్యారాణి హర్షం
ABN , Publish Date - Oct 02 , 2026 | 11:50 AM
బీసీ హాస్టళ్లు, గురుకులాల విద్యార్థుల డైట్ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయమని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు.
అమరావతి, అక్టోబర్ 2: బీసీ హాస్టళ్లు, గురుకులాల విద్యార్థుల డైట్ ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయమని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. గిరిజన, సాంఘిక, వెనుకబడిన, మైనారిటీ సంక్షేమ హాస్టళ్లలో డైట్ ఛార్జీలను పెంచడం ద్వారా విద్యార్థులకు మరింత నాణ్యమైన భోజనం అందిస్తామని తెలిపారు. సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లో డైట్ ఛార్జీల పెంపుపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
పేద విద్యార్థుల అభ్యున్నతికి సీఎం ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి అన్నారు. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా హాస్టళ్లను తీర్చిదిద్దుతున్నామని చెప్పుకొచ్చారు. పేద విద్యార్థుల మౌలిక సదుపాయాలకు, ఆటలకు, చదువులకు, ఉన్నతికి, అభివృద్ధికి ఎంత ఖర్చయినా ప్రభుత్వం వెనుకాడదని మంత్రి గుమ్మడి సంధ్యారాణి స్పష్టం చేశారు.
బీసీ హాస్టళ్లు, గురుకులాల డైట్ ఛార్జీలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. 3వ తరగతి నుంచి 6వ తరగతి విద్యార్థుల డైట్ ఛార్జీలను రూ.1150 నుంచి రూ.1265కు పెంచింది. అలాగే 7 నుంచి 10వ తరగతి విద్యార్థులకు రూ.1400 నుంచి రూ.1600కు ఛార్జీలను పెంచినట్టు ప్రకటించింది. అంతేకాకుండా ఇంటర్, ఆపై తరగతి విద్యార్థులకు రూ.1600 నుంచి రూ.1800కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడు రోజులు చికెన్, రోజూ పాలు, పండ్లు విద్యార్థులకు అందజేయాలని అధికారులను ఏపీ సర్కార్ ఆదేశించింది.
ఇవి కూడా చదవండి...
ఆటోను ఢీకొట్టిన అంబులెన్స్.. తెలంగాణ మహిళ మృతి
నెల్లూరులో పొట్టేపాళెం వంతెన ప్రారంభం.. నెరవేరిన నాలుగు నియోజకవర్గాల ప్రజల కల
Read Latest AP News And Telugu News