Share News

బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు కీలక ఆదేశాలు.. రేపే సుప్రీంకోర్టులో పిటిషన్

ABN , Publish Date - Oct 02 , 2026 | 12:07 PM

బీసీ రిజర్వేషన్‌పై రేపు సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ ఫైల్ చేయనుంది. రేపు మధ్యాహ్నానికి పిటిషన్ ఫైల్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

బీసీ రిజర్వేషన్లపై చంద్రబాబు కీలక ఆదేశాలు.. రేపే సుప్రీంకోర్టులో పిటిషన్
AP Government

అమరావతి, అక్టోబర్ 2: బీసీ రిజర్వేషన్‌పై రేపు(శనివారం) సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం పిటిషన్ ఫైల్ చేయనుంది. రేపు మధ్యాహ్నానికి పిటిషన్ ఫైల్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. స్థానిక ఎన్నికలలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలను ఏపీ హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని సర్కార్ నిర్ణయించింది.


రేపు సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తే వచ్చే వారం పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉందని న్యాయనిపుణులు చెబుతున్నారు. సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాదులను పంచాయతీరాజ్, పురపాలక శాఖ తరఫున వాదించేందుకు నియమించాలని సీఎం ఆదేశించారు. ఈరోజు(శుక్రవారం) ఉదయం ఢిల్లీలోని న్యాయనిపుణులతో ముఖ్యమంత్రి మాట్లాడారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ఇచ్చిన హమీకి కట్టుబడి ఉండాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.


ఇవి కూడా చదవండి...

నెల్లూరులో పొట్టేపాళెం వంతెన ప్రారంభం.. నెరవేరిన నాలుగు నియోజకవర్గాల ప్రజల కల

ఏపీ హాస్టల్ విద్యార్థులకు డైట్ ఛార్జీల పెంపుపై మంత్రి సంధ్యారాణి హర్షం

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 02 , 2026 | 12:24 PM