Share News

సమస్యలు పరిష్కరించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు: ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు

ABN , Publish Date - Oct 02 , 2026 | 11:10 AM

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ ఎన్జీవో అధ్యక్షులు విద్యాసాగర్, ఏపీ జేఏసీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

సమస్యలు పరిష్కరించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు: ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు
ap ngo president thanks government for solving problems

విజయవాడ, అక్టోబర్ 2: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ ఏన్జీవో అధ్యక్షులు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు.


‘25 రోజుల్లోనే ఉద్యోగుల డిమాండ్లను నెరవేరుస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలతో కలిపి రెండు డీఏ‌లను ప్రభుత్వం చెల్లించింది. డిసెంబర్ 1 నుంచే పెన్షనర్లకు అదనపు క్వాంటమ్ పెన్షన్ వర్తించేలా చర్యలు తీసుకుంది. ఆరోగ్య కార్డుల సమస్య పరిష్కారానికి నెలకు 36 కోట్ల నుంచి 40 కోట్లు నేరుగా ట్రస్ట్‌కు జమ అయ్యేలా నిర్ణయం తీసుకుంది. ఆరోగ్య కార్డ్ నిధులు నేరుగా ట్రస్ట్‌కు వెళ్లేలా చర్యలు తీసుకోవడం పదేళ్లలో ఇదే తొలిసారి. పీఆర్‌సీ(PRC) కమిటీ చైర్మన్‌గా మాజీ సీఎస్‌ దినేష్ కుమార్‌ను నియమించడం చాలా సంతోషంగా ఉంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్‌ను ప్రభుత్వం అమలు చేసింది. ఉద్యోగులకు మెరుగైన, నగదు రహిత వైద్య సేవలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు చేపడుతోంది. ఉద్యోగుల పట్ల, వారి డిమాండ్ల పట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి ఉద్యోగుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నా’ అని ఏపీ ఎన్జీవో అధ్యక్షులు విద్యాసాగర్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మహాత్మా గాంధీ చూపిన మార్గంలో పయనిద్దాం: మంత్రి లోకేశ్

సుప్రీంకోర్టులో 250 జూనియర్ కోర్టు అసిస్టెంట్ ఉద్యోగాలు.. డిగ్రీ అర్హత

For More AP News And Telugu News

Updated Date - Oct 02 , 2026 | 11:26 AM